పవన్ పట్ల అభిమానం ప్రాణం తీసింది!

  • April 9, 2016 / 10:08 AM IST

ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఒకరితో ఒకరు సన్నిహితంగానే ఉంటారు. కాని వారిని అభిమానించే ప్రేక్షకులు మాత్రం మా హీరో గొప్పంటే.. లేదు మా హీరో గొప్ప అంటుంటారు. ఈ వెర్రి అభిమానం ఒకరినొకరు చంపుకునే వరకు వెళ్తోంది. ఉగాది కానుకగా రిలీజ్ అయిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా చూడడానికి కర్ణాటకలోని స్థానిక అలంకార్ థియేటర్ కు తన మిత్రులతో వెళ్ళాడు రాకేశ్ నాయక్. సినిమా చూస్తున్న సమయంలో హీరోని వేరే వర్గం వాళ్లు కామెంట్‌ చేయడంతో… రాకేశ్‌నాయక్‌ వర్గం వారితో ఘర్షణ పడిందట. దీంతో ఇరు వర్గాల వారు కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ ఘర్షణలో రాశేక్‌నాయక్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. అభిమానం పేరుతో ప్రాణాలు తీయడం ఎంతవరకు సమంజసం. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus