కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్ కుమార్ గతేడాది అక్టోబర్ 29న 46 ఏళ్ల వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. నేడు పునీత్ ప్రధమ వర్థంతి.. ఏడాది గడిచినా ఆయన మరణించారనే వార్తను కుటుంబ సభ్యులు, అభిమానులు, కన్నడ ప్రజలు నమ్మలేకపోతున్నారు. నటుడిగా, గొప్ప మానవతావాదిగా అందరి మనసుల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు పునీత్.. పేద విద్యార్థులకు చదువు చెప్పించడం, గోశాలలు ఏర్పాటు చేయడం.. ఇలా లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు చేశారు పునీత్ రాజ్ కుమార్.
ఆయన ఫస్ట్ డెత్ యానివర్సరీ సందర్భంగా ఫ్యామిలీ మెంబర్స్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీ, కర్ణాటక ప్రభుత్వం, అభిమానులు, ఇతర రంగాలకు చెందిన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పిస్తున్నారు. ‘వుయ్ మిస్ యూ పునీత్’ అంటూ ఆయనతో తమకున్న అనుంబధాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. ఇప్పుడు #appuliveson హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.. పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్థంతికి ఒకరోజు ముందుగా అక్టోబర్ 28న ఆయన నటించిన ‘గంధడ గుడి’ చిత్రాన్ని కర్ణాటకలో భారీ స్థాయిలో రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది.
మరణానంతరం గౌరవార్దం ఆయనకు ‘కర్ణాటక రత్న’ పురస్కారం అందజేయనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ రజినీ కాంత్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. పునీత్ జ్ఞాపకార్థం 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతానికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఫైబర్ గ్లాస్‌తో పునీత్ రాజ్ కుమార్ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు.
21 అడుగుల ఎత్తులో ‘3డి’ టెక్నాలజీతో, నాలుగు నెలలపాటు శ్రమించి ఈ విగ్రహాన్ని తయారు చేశారు. నవంబర్ 1న బెంగుళూరులో జరుగబోయే కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారు. ప్రస్తుతం విగ్రహాన్ని బెంగుళూరుకి తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఇతర రాష్ట్రాలనుండి, ఇండస్ట్రీల నుండి సినీ ప్రముఖలు, అభిమానులు పెద్ద ఎత్తున రానుండడంతో కర్ణాటక ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!