Pawan Kalyan, Prabhas: పవన్ క్షమాపణలు చెప్పాలి.. డిమాండ్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్?

సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులు రోజురోజుకు విపరీతంగా అభిమానులు పెరిగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి హీరోల అభిమానుల మధ్య పెద్దఎత్తున వివాదాలు చెలరేగుతున్నాయి.ఇండస్ట్రీలో హీరోలందరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం వీరి అభిమానులు పెద్ద ఎత్తున మాటల యుద్ధానికి కాలు దువ్వుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల క్రితం మెగా అభిమాని అల్లు అర్జున్ ని ఉద్దేశిస్తూ ఏదో అనడంతో అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కు మెగా అభిమానులు క్షమాపణలు చెప్పాలి అంటూ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌ని ట్రెండ్ చేశారు అల్లు అర్జున్ అభిమానులు. అంతకు ముందు మహేష్ బాబు ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ అభిమానులు ప్రభాస్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున సోషల్ మీడియా వార్ నడుస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ప్రభాస్ అభిమానులు పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి క్షమాపణలు చెప్పాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఇంతకీ పవన్ కళ్యాణ్ ప్రభాస్ కి ఎందుకు క్షమాపణ చెప్పాలి అని ఆరా తీయగా… ఒక నెటిజన్ ట్విట్టర్స్పే స్‌లో చేసిన కామెంట్ కారణంగా ఈ వివాదం చెలరేగింది. అతను పవన్ కళ్యాణ్ అభిమాని కావడం గమనార్హం. ఆ నెటిజన్ చేసిన కామెంట్ కారణంగా ప్రభాస్ అభిమానులు ఏకంగా ప్రభాస్ కు పవన్ కళ్యాణ్ సారీ చెప్పాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.

ఈ విధంగా అభిమానులు డిమాండ్ చేయడంతో మరి కొందరు ఈ విషయంపై స్పందిస్తూ ఇలా సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తే ఆ హీరోలు సారీ చెబుతారా? ఇలాంటి అర్థంపర్థం లేని వివాదాలు అవసరమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus