Bhola Shankar OTT: భోళా ఓటీటీ రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్.. కానీ?

చిరంజీవి మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే. వేదాళం సినిమాకు రీమేక్ కావడం, రొటీన్ కథ కథనంతో తెరకెక్కడం, మెగా ఫ్యాన్స్ కు నచ్చే అంశాలు సినిమాలో ఎక్కువగా లేకపోవడం వల్ల భోళా శంకర్ సినిమా ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు సైతం తక్కువగా ఉన్నాయి. అయితే భోళా శంకర్ మూవీ విడుదలైన ఐదు వారాల తర్వాత ప్రముఖ ఓటీటీలలో ఒకటైన నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

వేర్వేరు కారణాల వల్ల థియేటర్లలో ఈ సినిమాను చూడని అభిమానులు ఓటీటీలో కచ్చితంగా చూస్తారనే సంగతి తెలిసిందే. థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన భోళా శంకర్ ఓటీటీలో అయినా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందేమో చూడాల్సి ఉంది. జైలర్ సినిమాకు పోటీగా రిలీజ్ చేయడం కూడా ఈ సినిమా రిజల్ట్ పై ప్రభావం చూపిందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అయితే భోళా శంకర్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుండగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో మళ్లీ నెగిటివ్ కామెంట్లు వస్తాయేమో అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

అయితే ఈ మధ్య కాలంలో థియేటర్లలో ఫ్లాపైన సినిమాలు (Bhola Shankar) ఓటీటీలలో సైతం ఆశించిన ఫలితాలను అందుకోవడం లేదు. భోళా శంకర్ ఓటీటీ రిజల్ట్ గురించి తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ పనులు శరవేగంగా జరుగుతుండగా ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.

సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా రీఎంట్రీలో చిరంజీవికి మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ను అందిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. చిరంజీవి తర్వాత సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిరంజీవి త్వరలో మరిన్ని కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం.

బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునేది ఆ హీరోనేనా..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus