Pathaan: ‘పఠాన్‌’ సినిమా కోసం ఓ ఫ్యామిలీ చేసిన పని తెలిస్తే.. ఫిదానే!

ఆకలి మీద ఉన్న పులి పంజా బాగా బలంగా తాకుతుంది అంటారు. అయితే ఆ ఆకలి నాలుగేళ్లకుపైగా ఉంటే.. పంజా బలం ఇంకెంత బలంగా ఉంటుందో ‘పఠాన్‌’ సినిమా వసూళ్లు చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా తొలి వారంలో రోజుకు రూ. 100 కోట్లు వసూలు చేసి అదరగొట్టే విజయం అందుకుంది. ఈ సినిమా కోసం దేశం మొత్తం ఉత్సవాలే జరుగుతున్నాయి. అయితే ఆ సినిమా కోసం ఏకంగా ఓ ఫ్యామిలీ దేశాలు దాటి ఇండియా వచ్చింది తెలుసా? అవును మీరు చదివింది నిజమే.

‘పఠాన్‌’ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే ఈ సినిమాను వివిధ కారణాల వల్ల బంగ్లాదేశ్‌లో విడుదల చేయలేదు. కారణాలేంటి అనే విషయం తర్వాత చూస్తే.. ఆ సినిమాను చూడటానికి అక్కడి నుండి మన దేశానికి వచ్చింది ఓ కుటుంబం. ‘పఠాన్‘ సినిమా చూసేందుకు బంగ్లాదేశ్‌లో నివాసం ఉంటున్న ఫిరోజ్ అహ్మద్ ఫ్యామిలీ ఢాకా నుండి త్రిపురలోని అగర్తాలకు వచ్చింది. ఈ విషయాన్ని ఫిరోజ్ ఫేస్‌ బుక్‌లో షేర్‌ చేశారు.

ఈ పోస్టును అగర్తలాలోని రూపసి సినిమా హాల్ యజమాని సతాదీప్ సాహా ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. “ఇది చాలా గొప్ప విషయం. ‘పఠాన్’ సినిమా చూడటానికి బంగ్లాదేశ్ నుండి భారత్‌కు ప్రేక్షకులు వస్తున్నారు’’ అంటూ ఆ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అయితే ఆ ట్వీట్‌కు ఫిరోజ్ రిప్లయ్‌ ఇచ్చారు. “నేను భారతదేశానికి చెందినవాడినే. నా కుటుంబంతో కలసి బంగ్లాదేశ్‌లో ఉంటూ ఉద్యోగం చేస్తున్నాను. ‘పఠాన్’ సినిమాను బంగ్లాదేశ్ ప్రభుత్వం విడుదల చేయకూడదని ఆదేశించింది అని తెలిపారు.

షారుఖ్ ఖాన్ మీద ఉన్న అభిమానంతో భారత్‌ వచ్చి మరీ.. సినిమా చూశాం అని ఫిరోజ్‌ ట్వీట్‌లో రాసుకొచ్చారు. అంతేకాదు షారుఖ్ తర్వాత సినిమా ‘జవాన్’ను కూడా భారత్‌లోనే చూడాలని అనుకుంటున్నాం అని చెప్పారు. అయితే ఆ సినిమాను బంగ్లాదేశ్‌లో విడుదల చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని అభిమానులు ఆశిస్తున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus