సూపర్ స్టార్ కొత్త సినిమా టైటిల్ పై అభిమానుల అసంతృప్తి!

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ  వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలో ప్రిన్స్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ లపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వందకోట్ల బడ్జెట్ తో ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధులు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ టీజర్ ని దీపావళికి రిలీజ్ చేయనున్నారు.

అయితే ఈ చిత్రం టైటిల్ విషయంలో మహేష్ ఫ్యాన్స్ చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఇంకా పేరు ఫిక్స్ చేయలేదు కదా ? అని మీకు డౌట్ రావచ్చు.. అది కరెక్టే కానీ.. ఈ సినిమాకు వాస్కోడి గామ, హంటర్, స్టన్ గన్, అభిమన్యుడు, ఏజెంట్ అనే పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారంలో ఉంది. వీటిలో అభిమన్యుడు పేరు మీద వచ్చిన సినిమాలు ఫెయిల్ అయ్యాయని, ఆ పేరు జోలికి పోవద్దవి ఫ్యాన్స్ ఇదివరకు చూసించారంట. తాజాగా వాస్కోడి గామ టైటిల్ నచ్చలేదని, ఆ పేరుని కూడా పక్కన పెట్టమని అభిమానులు సూపర్ స్టార్ ని కలిసి చెప్పారని, అందుకు ఆయన నవ్వుతూ చూద్దాంలే అని అన్నారని తెలిసింది. మరి ఫ్యాన్స్ మాటకు మహేష్ ఎంత వరకు విలువ ఇస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus