అమీర్ తో తాను రిలేషన్ లో ఉన్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ఫాతిమా

  • December 27, 2018 / 10:06 AM IST

సినిమా ఇండస్ట్రీలో వావివరసలు అనే ఉండవు అని అప్పట్లో కొందరు రచయితలు, సీనియర్ జర్నలిస్టులు అంటుండేవారు. ఆ తర్వాత కాలంలో అది నిజమేనని చాలామంది తెలిసిందనుకోండి. కాకపోతే.. ఈమధ్యకాలంలో ఇండస్ట్రీ వర్గాల పోకడ ఎలా ఉన్నా.. కొన్ని మీడియా సంస్థల పోకడ మాత్రం మరీ దారుణంగా తయారైంది. క్లిక్స్ కోసం చండాలమైన వార్తలు రాయడం, కొన్ని వార్తల్ని వైరల్ చేయడం కోసం హీరోహీరోయిన్ల నడుమ లేనిపోని రిలేషన్స్ క్రియేట్ చేయడం చేస్తుంటారు. అయితే.. ఇప్పుడు పోటీ ప్రపంచంలో ఆ వైరల్ వార్తలు సరిపోవడం లేదేమో.. అందుకే ఈమధ్య ఇల్లీగల్ రిలేషన్స్ ను కూడా వార్తలుగా రాసేస్తున్నారు.

అలా ఆ తరహా వార్తలకి బలైన కొత్తమ్మాయమొదట్లో ఈ వార్తల్ని ఎవరూ పెద్దగా కేర్ చేయలేదు కానీ.. రాను రాను ఆ వార్తల ప్రభంజనం పెరగడంతో ఫాతిమా ఎట్టకేలకు స్పందించింది. నాకు అమీర్ ఖాన్ తండ్రి లాంటి వారు.. సినిమాల్లో మేం పోషించేది పాత్రలు మాత్రమే. అంతమాత్రాన మా ఇద్దరికీ ఇలా చాండాలమైన రంకు అంటగట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంది” అని బాధపడింది ఫాతిమా. మరి ఫాతిమా ఇంత బాధపడుతూ ఇచ్చిన ఆన్సర్ తర్వాతైనా ఈ వార్తల ప్రవాహం ఆగుతుందో లేదో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus