Megha Akash Marriage Photos: ఘనంగా మేఘా ఆకాష్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

నితిన్ (Nithin Kumar)  – హను రాఘవపూడి  (Hanu Raghavapudi)  కాంబినేషన్లో వచ్చిన ‘లై’  (LIE) తో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్  (Megha Akash) . ఆ తర్వాత నితిన్ తోనే ‘ఛల్ మోహన్ రంగ’ (Chal Mohan Ranga)  చిత్రంలో కూడా హీరోయిన్ గా చేసింది. అవి రెండూ ఫ్లాప్ అయ్యాయి.అయినప్పటికీ ఈమెకు ‘రాజ రాజ చోర’  (Raja Raja Chora)  ‘రావణాసుర’  (Ravanasura)  వంటి పెద్ద సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కొన్నాళ్లుగా ఈమె తమిళనాడుకు చెందిన బిజినెస్మెన్ సాయి విష్ణుతో ప్రేమలో ఉంది. గత నెలలో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

Megha Akash Marriage Photos:

ఇక తాజాగా వీరిద్దరూ పెళ్లిపీటలు కూడా ఎక్కడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక మేఘా ఆకాష్ పెళ్లి ఈరోజు ఘనంగా జరిగింది. ఆమె ప్రియుడు సాయి విష్ణుతో మెడలో 3 ముళ్ళు వేయించుకుని,అతనితో 7 అడుగులు నడిచింది. ఈరోజు సెప్టెంబర్ 15న, ఆదివారం నాడు మేఘా ఆకాష్, సాయి విష్ణు..ల పెళ్లి చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. ఇరు కుటుంబ సభ్యులతో పాటు, ఇంకా సినీ రాజకీయ ప్రముఖులు అంతా ఈ పెళ్ళికి హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించినట్టు తెలుస్తుంది.

నిన్న సాయంత్రం వీరి వెడ్డింగ్ రిసెప్షన్ కూడా నిర్వహించడం జరిగింది. దానికి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం హాజరయ్యి వీరికి బెస్ట్ విషెస్ తెలిపారు. దానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక మేఘా ఆకాష్ పెళ్లి ఫోటోలు కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ఈ దంపతులకి ‘కంగ్రాట్యులేషన్స్’ ‘హ్యాపీ మ్యారీడ్ లైఫ్’ అంటూ నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసిన శేఖర్ బాషా!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus