Fighter Raja Teaser: ఫైటర్ రాజా టీజర్ అదిరిపోయిందిగా.. బ్లాక్ బస్టర్ అంటూ!

రామ్జ్, మాయా ఎస్ కృష్ణన్ జంటగా కృష్ణప్రసాద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫైటర్ రాజా మూవీ టీజర్ ను ప్రముఖ టాలీవుడ్ నటుడు విశ్వక్ సేన్ లాంఛ్ చేశారు. ఫైట్స్ విషయంలో ఆసక్తి ఉన్న రాజా(రామ్జ్) సినిమా రంగంలో ఫైట్ మాస్టర్ గా పని చేస్తుంటాడు. అతని ఫ్రెండ్ అయిన హీరోయిన్ కూడా అదే రంగంలో కెరీర్ ను కొనసాగిస్తూ ఉంటుంది. అయితే ఒకానొక సమయంలో రాజా ఒకరి నుంచి డబ్బులు దొంగలించి తప్పించుకొని తిరుగుతుంటాడు.

డబ్బులు కొట్టేసిన తర్వాత రాజా జీవితంలో చోటు చేసుకున్న మలుపులేమిటి? ఆ డబ్బు ఎవరిది? రాజా ఎందుకు డబ్బులు దొంగలించాల్సి వచ్చింది? చివరికి ఆ డబ్బు ఎక్కడికి చేరింది? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. టీజర్ చూసిన నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. టీజర్ అదిరిపోయిందని బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న తనికెళ్ల భరణి ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు. రన్ వే ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నంబర్2 గా ఈ సినిమా తెరకెక్కింది. నందు, రోషన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించనున్నారు.

స్మరణ్ సాయి ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. ఈ మధ్య కాలంలో వినూత్న కథాంశాలతో తెరకెక్కుతున్న సినిమాలు ప్రేక్షకులను అలరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమా కూడా అదే జాబితాలో చేరుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామ్జ్ కు ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉండగా ఈ సినిమాతో రామ్జ్ కెరీర్ పరంగా మరింత ఎదిగి ప్రేక్షకులకు మరింత దగ్గరవుతారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus