మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి గుర్రపు స్వారీ, కత్తి విన్యాసాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ హైదరాబాదలోని నానక్ రామ్ గూడా స్టూడియోస్ లో 1840 ల నాటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ పనులు పూర్తి కావచ్చాయి. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే నెల షూటింగ్ మొదలుకానుంది. ఈ చిత్ర బృందంలో స్వల్ప మార్పు జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తెరకెక్కనున్న ఏఈ సినిమాకి సంగీత దర్శకుడిగా ముందుగా ఆస్కారం వర్డ్ గ్రహీత ఏ ఆర్ రెహమాన్ ని అనుకున్నారు. అయితే అతనికి వృత్తి పరమైన ఆబ్లికేషన్స్ వల్ల సైరా కి పనిచేయలేకపోయారు.
అందుకే అతను పక్కకు తప్పుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. ఆ స్థానంలో థమన్ వచ్చినట్లు వివరించారు. చిరు పుట్టిన రోజున రిలీజ్ అయినా “సైరా” మోషన్ పోస్టర్‌కి తమనే సంగీతం అందించారు. ఆ సంగీతం అందరి రోమాలు నిక్కబొడిచేలా చేసింది. సో రెహమాన్ తప్పుకోవడంతో చిత్ర బృందం ఏకగ్రీవంగా థమన్ ని ఎంపిక చేసుకున్నాయి. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించనున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయన తార నటిస్తోంది. మరికొన్ని కీలక పాత్రల్లో అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, కిచ్చ సుదీప్, విజయ్ సేతు పతి కనిపించనున్నారు.