Chiranjeevi: చిరు సినిమా సెట్లో భారీగా మంటలు.. టెన్షన్లో మెగా ఫ్యాన్స్..!

మెగాస్టార్ చిరంజీవి సినిమా సెట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశం అయ్యింది. హైదరాబాద్ కోకాపేట లేక్ వద్ద చిరంజీవి సినిమా కోసం ఓ భారీ సెట్ను ఏర్పాటు చేశారు. అయితే సోమవారం నాడు రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడడంతో వెంటనే వట్టినాగులపల్లి ఫైర్ స్టేషన్ సిబ్బందికి ఫోన్ చేసి సమాచారం అందించగా..వెంటనే వారు ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పడం మొదలుపెట్టారు. అయితే కంగారు పడాల్సిన పనేమీ లేదు. అక్కడ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు అని తెలుస్తుంది. పరిస్థితి అంతా కంట్రోల్లోకి వచ్చిందట.

చిరంజీవి ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ అనే మూవీలో నటిస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం జరిగింది ఈ సినిమా సెట్ లో కాదు. గత ఏడాది రిలీజ్ అయిన ‘ఆచార్య’ మూవీ సెట్లో..! అవును ఆ మూవీ కోసం కోకాపేట్ లేక్ వద్ద భారీ సెట్ వేశారు. దీని కోసం కోట్లు ఖర్చు చేశారు నిర్మాతలు. ఇప్పుడు ఆ సెట్ అక్కడ అలాగే ఉండిపోయింది.

ఇక 2022 ఏప్రిల్ 29న రిలీజ్ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ‘ఆచార్య’ చిత్రం ఘోర పరాజయం పాలైంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ భారీ నష్టాలను మిగిల్చింది. సినిమా చిత్రీకరణ సమయంలో కూడా టెంపుల్ సెట్ వేయగా.. అది కూడా కూలిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఏదేమైనా కోకాపేట్ సెట్ తో మరోసారి ‘ఆచార్య’ మిగిల్చిన గాయాన్ని రేపినట్టు అయ్యింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus