‘అఖండ 2’ సినిమా టికెట్ హైక్స్ పై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇక నుండి పెద్ద సినిమాలకు తెలంగాణలో ఎటువంటి హైక్స్ అలాగే ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వబడదు అంటూ కచ్చితంగా చెప్పడం కూడా జరిగింది. ఈ క్రమంలో 2026 సంక్రాంతి సినిమాల మేకర్స్ లో టెన్షన్ పెరిగింది. వాస్తవానికి సంక్రాంతికి 2 పెద్ద సినిమాలు వస్తున్నాయి. అవే ప్రభాస్ ‘ది రాజాసాబ్’ , చిరంజీవి ‘మనశంకర్ వరప్రసాద్ గారు’.
ఈ 2 సినిమాలకు రూ.100 కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి ఈ 2 సినిమాలకి టికెట్ హైక్స్, అదనపు షోలు వంటివి అవసరం. మిగిలిన సినిమాలకు అవసరం లేదు. రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’, నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’, శర్వానంద్ ‘నారీ నారీ నడుమ మురారి’, అలాగే ‘జన నాయకుడు’ ‘పరాశక్తి’ వంటి డబ్బింగ్ సినిమాలకి టికెట్ హైక్స్ వంటివి అవసరం లేదు. కరెక్ట్ గా వాటికి స్క్రీన్స్ దొరికినా ఎక్కువే.
అలాంటప్పుడు ‘ది రాజాసాబ్’, ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ వంటి సినిమాలకు టికెట్ హైక్స్ లేకపోతే ఎలా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. వాస్తవానికి తెలంగాణలో ఎలా ఉన్నా.. ఆంధ్రలో టికెట్ హైక్స్, అదనపు షోలకు అనుమతులు లభిస్తే సరిపోతుంది. ఎందుకంటే 90 శాతం జనాలు పండక్కి ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఆ టైంలో తెలంగాణలో కలెక్షన్స్ ఎక్కువ రావు. పండగ సెలవులు ముగిశాక కలెక్షన్స్ పెరుగుతాయి.
ఆంధ్రాలో ఎలాగు చిరంజీవికి పవన్ కళ్యాణ్ అండ ఉంది, ప్రభాస్ సినిమా నిర్మాత టి.జి.విశ్వప్రసాద్ కి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఉంది. సో ప్రాబ్లమ్ ఎక్కువగా ఉండదు అనే చెప్పాలి.