Boyapati Srinu: బోయపాటి నెక్స్ట్.. ఎవరితో?

బోయపాటి శ్రీనుకి ఓ అలవాటు ఉంది. అతను వేరే హీరోలతో సినిమాలు చేస్తే అవి ఆడటం లేదు. ఎన్టీఆర్ తో చేసిన ‘దమ్ము’, రాంచరణ్ తో చేసిన ‘వినయ విధేయ రామ’, రామ్ తో చేసిన ‘స్కంద’ సినిమాలు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలా ప్లాపులు ఎదురైనప్పుడు బోయపాటి శ్రీను ట్రంప్ కార్డు వాడుతూ ఉంటాడు. ఆ ట్రంప్ కార్డే బాలయ్యతో సినిమా చేయడం.

Boyapati Srinu

‘దమ్ము’ ప్లాప్ అయినప్పుడు ‘లెజెండ్’ చేశాడు. హిట్టు కొట్టి ఫామ్లోకి వచ్చాడు. ఆ తర్వాత చేసిన ‘సరైనోడు’ కూడా బాగానే ఆడింది. తర్వాత ‘జయ జానకి నాయక’ ‘వినయ విధేయ రామ’ సినిమాలు ఆడలేదు. సరిగ్గా అలాంటి టైంలో ‘అఖండ’ చేశాడు.. అది బ్లాక్ బస్టర్ అయ్యింది. తర్వాత రామ్ తో చేసిన ‘స్కంద’ ప్లాప్ అయ్యింది. దీంతో మళ్ళీ బాలయ్యతో ‘అఖండ 2’ సెట్ చేసుకున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా కూడా బాగానే ఆడుతుంది.

కానీ ‘అఖండ 2’లో బోయపాటి చాలా మిస్టేక్స్ చేశాడు. బాలయ్య కాబట్టి.. దేవుడి కాన్సెప్ట్ కాబట్టి సరిపోయింది. కానీ వేరే హీరోలతో ఇలాంటి సినిమాలు చేస్తే వర్కౌట్ అవ్వవు. బోయపాటి ఈ విషయంలో జాగ్రత్తలు పడాలి. కానీ ఇప్పటివరకు అతను అలాంటి జాగ్రత్తలు తీసుకున్న సందర్భం లేదు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. బోయపాటి నెక్స్ట్ సినిమా ఏ హీరోతో చేస్తాడు అనే ప్రశ్న ఇప్పుడు అందరి మైండ్లో ఉంది.

ఇప్పుడు స్టార్ హీరోలంతా బిజీ. ఒకవేళ ఖాళీగా ఉన్నా.. బోయపాటితో సినిమా అంటే వేరే హీరోలు ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే బోయపాటిపై ఎక్కువ పాజిటివిటీ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారా? అంటే అది కచ్చితంగా అల్లు అర్జున్ అనే చెప్పాలి. అవును.. బోయపాటితో సినిమా చేయాలని అల్లు అర్జున్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ‘గీతా ఆర్ట్స్’ అడ్వాన్స్ కూడా బోయపాటి వద్ద ఉంది. కాబట్టి.. ఈ కాంబో సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

‘లైలా’ రిజల్ట్ ను మరిపించేందుకు రెడీ అవుతున్న విశ్వక్ సేన్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus