మన మాస్ మహారాజా రెండేళ్ల క్రితం వరకు క్షణం తీరికలేకుండా సినిమాలు చేసిన విషయం ఫ్యాన్స్ అందరికీ తెలిసిందే. ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా చూసుకునే రవితేజ “బెంగాల్ టైగర్” తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకొని “రాజా ది గ్రేట్”తో మళ్ళీ తెరపైకి వచ్చారు. అయితే.. ఆ గ్యాప్ తీసుకొచ్చిన మార్పో లేక ప్రెజంట్ జనరేషన్ కి తగ్గట్లుగా తానుండాలని మాస్ మహారాజా ఫిక్స్ అయ్యాడో తెలియదు కానీ.. తన కెరీర్ లో మొట్టమొదటిసారిగా తాను నటించిన ఒక సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వకుండానే మరో సినిమాకి షూటింగ్ స్టార్ట్ చేశాడు.
రవితేజ కెరీర్ లో ఇలా చేయడం ఇదే ప్రప్రధమం. అందుకే ఆయన అభిమానులందరూ ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చూస్తుంటే.. ఈ రెండేళ్లలో వచ్చిన గ్యాప్ ని 2018లో కంప్లీట్ చేసేలా ఉన్నాడు రవితేజ. అలాగే.. రవితేజ ఇంకో సినిమా కూడా ఫైనల్ చేశాడని తెలుస్తోంది. “ఎవడో ఒకడు” అనే సినిమా ప్రారంభమై ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే.. అదే డైరెక్టర్ తో సినిమా మళ్ళీ మొదలెట్టే ఆలోచనలో ఉన్నాడట. ఆ డైరెక్టర్ మరెవరో కాదు ఇటీవల “మిడిల్ క్లాస్ అబ్బాయి”తో కమర్షియల్ హిట్ అందుకొన్న శ్రీరామ్ వేణు.