సినీ పరిశ్రమలో ప్రేమ,డేటింగ్ వ్యవహారాలు కామన్. ఆ మాటకు వస్తే.. ఇప్పుడు కార్పొరేట్ రంగంలో కామన్ అయిపోయిన సెగ్మెంట్ ఇది. కాకపోతే సినిమా రంగంలోనే ఇవి హైలెట్ అవుతూ ఉంటాయి. సరే అసలు విషయానికి వెళ్ళిపోదాం. ప్లాపుల్లో ఉన్న ఓ హీరోయిన్ కి ఇప్పుడు అవకాశాలు తగ్గాయి. దీంతో తనతో పనిచేసిన హీరోతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వస్తోందట. అది కూడా అవకాశాల కోసమే.
హీరో గారిని గ్రిప్ లో పెట్టుకుంటే.. తన సినిమాల్లో రికమండ్ చేస్తాడనేది ఆమె స్ట్రాటజీ. అప్పట్లో ఈమె పలు సినిమాల్లో చిన్న పాత్రలు చేసేది. రోజుకు రూ.10 వేలు పారితోషికం అందుకునేది. తర్వాత ఓ సినిమాలో హీరోయిన్ గా చేసే ఛాన్స్ దక్కించుకుంది. లక్ కొద్దీ ఆ సనిమా క్లిక్ అయ్యింది.అందులోనూ ఆ సినిమాకి ఈమె నటనే హైలెట్ అనే రేంజ్లో పేరొచ్చింది. దీంతో వరుస ఆఫర్లు వచ్చాయి ఈమెకు.
హీరోయిన్ గా చేసిన సినిమాకి రూ.5 లక్షలు పారితోషికం అందుకుంటే.. తర్వాతి సినిమాలకు రూ.60 లక్షలు పారితోషికం డిమాండ్ చేసే స్థాయికి వెళ్ళింది. కాకపోతే తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. గతంలో తనతో నటించిన ఓ హీరో సినిమాలో ఇప్పుడు నటిస్తుంది. నిర్మాతకి ఇష్టం లేకపోయినా హీరో ఒత్తిడి మేరకు ఆ హీరోయిన్ ను పెట్టుకోవాల్సి వచ్చింది.
ఇలా ఆమె ప్లాన్ వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు తనతో పనిచేసిన మరో టాప్ హీరోని కూడా లైన్లో పెట్టే పనిలో పడింది. ఆ టాప్ హీరో నెక్స్ట్ సినిమా షూటింగ్ సెట్స్ కి వెళ్లి.. అతనితో టైం స్పెండ్ చేస్తూ వస్తోందట. ఇది కేవలం ఆఫర్స్ కోసమే. ఇక్కడ కామెడీ ఏంటంటే.. ఈ టాప్ హీరోతో సన్నిహితంగా ఉన్నట్టు.. ఈమెను తన సినిమాలో రికమెండ్ చేసిన చిన్న హీరోకి తెలీదు. అది మేటర్..!