మెగాస్టార్ 156 వ సినిమాని ‘బింబిసార’ దర్శకుడు మల్లిడి వశిష్ట తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. ‘బింబిసార’ బ్లాక్ బస్టర్ అవ్వడంతో చిరు పిలిచి మరీ వశిష్ఠకి అవకాశం ఇచ్చారు..! ఇందుకు వశిష్ట తండ్రి మల్లిడి సత్యనారాయణ గారితో చిరుకి ఉన్న బాండింగ్ కూడా ఓ కారణం అని చెప్పాలి. ఈ మధ్యనే ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. సోషియో ఫాంటసీ జోనర్ లో .. పంచభూతాల థీమ్ తో ఈ సినిమా ఉంటుందని కాన్సెప్ట్ పోస్టర్ తో చెప్పకనే చెప్పారు.
అలాగే ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు టాక్ వినిపించింది. ఇన్సైడ్ టాక్ ప్రకారం.. అదే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు కూడా సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా కీరవాణి ఏమాపికయ్యారు. అలాగే చిరు ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ స్టైల్లో ఈ చిత్రం కథ, కథనాలు ఉంటాయనే టాక్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సునీల్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషిస్తారని..
మెయిన్ గా ఆయన మార్క్ కామెడీ ఈ సినిమాలో ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపించాయి. ఇదిలా ఉండగా..ఈ సినిమాలో చిరు పాత్ర ఎలా ఉండబోతుంది అనే విషయం పై కూడా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. మొదటిసారి చిరు తన సొంత జిల్లా పశ్చిమ గోదావరి వాసిగా కనిపిస్తారట. భీమవరం దొరబాబు అనే పాత్రని చిరు (Chiranjeevi) ఈ సినిమాలో పోషిస్తున్నట్టు సమాచారం. సునీల్ కూడా అదే జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి..! అక్కడ యాసలో కామెడీ అదరగొడతారని తెలుస్తుంది.
మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!
స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!