తమిళ దర్శకుడు శశి దర్శకత్వంలో జివి ప్రకాష్, సిద్దార్థ్ లు కలిసి నటిస్తుండగా ఈ చిత్రం సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. గ్రామీణ నేపథ్యంలో ఇద్దరు మిత్రుల మధ్యే ఈ చిత్ర కథాంశం అల్లుకొని ఉంటుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం జివి ప్రకాష్ రాజీవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్రూస్ లీ చిత్రంలో నటిస్తుండగా.. ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశలో ఉంది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత శశి తెరకెక్కించనున్న చిత్రం లో జివి ప్రకాష్ నటించే అవకాశం ఉంది.