Gaami Collections: ‘గామి’ 10 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?

విశ్వక్ సేన్ (Vishwak Sen)  ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘గామి’ (Gaami). విద్యాధర్ కాగిత  (Vidyadhar Kagita)  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి (Chandini Chowdary) హీరోయిన్. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ (Karthik Sabareesh)  ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్, మేకింగ్ వీడియో వంటివి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. మార్చి 8న శివరాత్రి కానుకగా రిలీజ్ అయిన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి.

ఆల్రెడీ ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.31 cr
సీడెడ్ 0.93 cr
ఉత్తరాంధ్ర 0.94 cr
ఈస్ట్ 0.66 cr
వెస్ట్ 0.41 cr
గుంటూరు 0.51 cr
కృష్ణా 0.49 cr
నెల్లూరు 0.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 7.54 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.82 cr
 ఓవర్సీస్ 2.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 10.76 cr (షేర్)

‘గామి’ (Gaami) చిత్రానికి రూ.9.15 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.9.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.10.76 కోట్లు షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.26 కోట్ల లాభాలను అందించింది.

షరతులు వర్తిస్తాయి సినిమా రివ్యూ & రేటింగ్!

‘డెవిల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?
‘బబుల్ గమ్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus