Gaami First Review: ‘గామి’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

మాస్ క దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ(Gaami)  ‘గామి’. విద్యాధర్ కాగిత (Vidyadhar Kagita)  దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించింది. ‘తమడా మీడియా’ ‘వి సెల్యులాయిడ్’ సమర్పణలో ‘కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌’ బ్యానర్ పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన గ్లింప్స్ ను, మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.

మార్చి 8న శివరాత్రి కానుకగా ‘గామి’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ అఘోర పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాకి మైథలాజికల్ టచ్ ఉంది కాబట్టి… శివ భక్తులు బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంతా అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది ఇండస్ట్రీ పెద్దలకి చూపించడం జరిగింది. సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేయడం కూడా జరిగింది.

వారి టాక్ ప్రకారం.. శంకర్(విశ్వక్ సేన్) జీవితంలో చోటు చేసుకున్న కొన్ని ఊహించని సంఘటనల వల్ల అతనికి ఎలాంటి సమస్యలు వచ్చాయి.? అందుకు దుర్గ(అభినయ) ఎలా కారణమైంది. శంకర్ హిమాలయాలకు ఎందుకు వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. అతనికి జాహ్నవి(చాందినీ చౌదరి) (Chandini Chowdary) మధ్య పరిచయం ఎలా ఏర్పడింది? అనేది ‘గామి’ కథ అని తెలుస్తుంది.

సినిమాలో  వచ్చే సన్నివేశాలు గ్రిప్పింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ వద్ద విజువల్స్ మంచి ట్రీట్ ఇస్తాయట. సెకండాఫ్ లో మెయిన్ ప్లాట్ రివీల్ అవుతుందని, క్లైమాక్స్ చాలా ఎమోషనల్ గా సాగుతుందని అంటున్నారు. ‘గామి’ కి సినిమాటోగ్రఫీ, విజువల్స్ ఆయువు పట్టు అని అంటున్నారు. మొత్తంగా ‘గామి’ ఈ శివరాత్రి పండుగ రోజున తప్పకుండా చూడాల్సిన సినిమా అని వారు చెబుతున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus