Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 1, 2026 / 05:08 PM ISTByPhani Kumar
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Gaayapadda Simham Review in Telugu: గాయపడ్డ సింహం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • తరుణ్ భాస్కర్ (Hero)
  • ఫారియా అబ్దుల్లా, మానస చౌదరి (Heroine)
  • జె.డి.చక్రవర్తి, శుభలేఖ సుధాకర్,శ్రీవిష్ణు, హర్షవర్ధన్, కశ్యప్ శ్రీనివాస్, విష్ణు ఓఐ తదితరులు (Cast)
  • కశ్యప్ శ్రీనివాస్ (Director)
  • కళ్యాణ్ చక్రవర్తి మంతిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ కుమార్ బన్సల్ (Producer)
  • స్వీకర్ అగస్తి (Music)
  • విద్యా సాగర్ చింత (Cinematography)
  • విప్లవ్ (Editor)
  • Release Date : 1st మే 2026
  • సప్త అశ్వ మీడియా వర్క్స్, జీ స్టూడియోస్ & POV స్టోరీస్ (Banner)

తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కిన మరో అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్టైనర్ మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే.. దీనికి సక్సెస్ఫుల్ దర్శకుడు పవన్ సాధినేని సమర్పకులుగా వ్యవహరించడం. అలాగే నైజాంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ చేస్తుండటం. అలాగే శ్రీవిష్ణు అతిథి పాత్ర పోషించడం. దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలను తీసుకొచ్చి అగ్రెసివ్ గా ప్రమోషన్ చేయడం వల్ల కూడా ‘గాయపడ్డ సింహం’ ఈ వారం సినీ లవర్స్ కి ఫస్ట్ ఛాయిస్ అయ్యింది. మరి ఆ అంచనాలు ఈ సినిమా ఎంత వరకు అందుకుందో తెలుసుకుందాం రండి:

Gaayapadda Simham Movie Review

Gaayapadda Simham Movie Review and Rating

కథ: దరహస్ దాస్యం(తరుణ్ భాస్కర్) ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్. సాయి గాయిత్రి(మానస చౌదరి) అనే పెద్ద కుటుంబానికి చెందిన అమ్మాయిని ఇతను గాఢంగా ప్రేమిస్తాడు. గాయిత్రి కూడా దరహాస్ ను ప్రేమిస్తుంది. తమ ప్రేమ విషయం తన తండ్రి గౌతమ్ వాసుదేవ్ మూర్తికి(అనీష్ కురువిల్లా) చెప్పి పెళ్ళికి ఒప్పించేందుకు దరహస్ ని ఇంటికి పిలుస్తుంది సాయి గాయిత్రి. అయితే తన కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అంటే దరహాస్ అమెరికా వెళ్ళి సెటిల్ అవ్వాలనే కండిషన్ పెడతాడు గౌతమ్ వాసుదేవ్ మూర్తి. దరహాస్ కూడా ఆ ప్రయత్నాల్లో బిజీ అవుతాడు. ఓ మంచి కన్సల్టెన్సీని అప్రోచ్ అయ్యి అమెరికా వెళ్ళేందుకు అర్హత పొందుతాడు.

కానీ అమెరికా వెళ్ళిన తెలుగు యువతని రకరకాల కారణాలతో ఇండియాకి తిరిగి పంపించేస్తాడు అమెరికా అద్యక్షుడు ట్రంప్. ఈ వార్త మీడియాలో కూడా వైరల్ అయ్యి గాయిత్రి తండ్రి చెవిన పడుతుంది. దీంతో దరహాస్, గాయిత్రి..ల పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. అలాగే దరహాస్ జాబ్ లెస్ అయిపోతాడు. ఈ క్రమంలో అతను మానసికంగా డిస్టర్బ్ అయ్యి ఏకంగా ట్రంప్ పై కక్ష్యసాధింపు చర్యకి పాల్పడతాడు. దాని వల్ల బ్రూతల్ ధర్మ(జె డి చక్రవర్తి) అనే రౌడీ షీటర్ కెరీర్ డిస్టర్బ్ అవుతుంది. దీంతో ధర్మ.. దరహాస్ ని చంపాలనుకుంటాడు. తర్వాత దరహాస్.. ధర్మ బారి నుండి ఎలా తప్పించుకున్నాడు.? మధ్యలో భైరవ్ దాస్(శ్రీవిష్ణు) పాత్ర ఏంటి? అనేది మిగిలిన కథ.

Gaayapadda Simham Movie Review and Rating

నటీనటుల పనితీరు: తరుణ్ భాస్కర్ హీరోగా సక్సెస్ కోసం ఎదురుచూస్తూ స్ట్రగుల్ అవుతున్నాడు కాబట్టి.. ఈ పాత్ర అతనికి బాగా యాప్ట్ అయిన ఫీలింగ్ ఇస్తుంది. అతను కూడా తన పాత్రని ఎంతో ఈజ్ తో చేసేశాడు. హీరోయిన్లలో ఫరియా స్క్రీన్స్ స్పేస్ తక్కువ అని ప్రమోషన్స్ లో ఆమె చెప్పుకుంది. కానీ ఆమెతో పోలిస్తే మానస చౌదరి స్క్రీన్స్ స్పేస్ తక్కువగా ఉంది. అయితే ఇద్దరు హీరోయిన్లు కూడా తమ క్యూట్ లుక్స్ తో ఆకట్టుకున్నారు. జె డి చక్రవర్తి ధర్మ అనే స్టైలిష్ విలన్ గా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడక్కడ సీరియస్ గా కనిపిస్తూనే కామెడీ టైమింగ్ తో మెప్పించాడు. శ్రీవిష్ణు పాత్ర ఎంటర్ అయినప్పటి నుండీ కథనంలో వేగం పుంజుకుంది. క్లైమాక్స్ లో ఇతని పాత్రతో సీక్వెల్ కి లీడ్ ఇచ్చిన విధానం బాగుంది. శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్, విష్ణు ఓఐ కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు. దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ నటుడిగా కూడా మంచి మార్కులు వేయించుకున్నాడు. మిగతా నటీనటులు కూడా తమ పాత్రలకి న్యాయం చేశారు.

Gaayapadda Simham Movie Review and Rating

సాంకేతిక నిపుణుల పనితీరు: ఇక్కడ మళ్ళీ మనం దర్శకుడు కశ్యప్ శ్రీనివాస్ గురించి చెప్పుకోవాలి. ఒక చిన్న పాయింట్ తీసుకుని రెండున్నర గంటల పాటు బోర్ కొట్టకుండా కథనాన్ని నడిపించడంలో అతను నూటికి నూరుపాళ్లు సక్సెస్ అయ్యాడు. శ్రీవిష్ణు పాత్ర ఎంటర్ అయినప్పటి నుండీ ఎక్కడా బోర్ కొట్టకుండా క్లైమాక్స్ వరకు హిలేరియస్ గా కథనాన్ని నడిపించాడు. డైలాగులు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా కే జి ఎఫ్, పోకిరి , బొమ్మరిల్లు, సలార్ వంటి సినిమాల్లోని ఐకానిక్ సన్నివేశాలు తీసుకుని చేసిన స్పూఫ్స్ కామెడీ పండించాయి.

కచ్చితంగా కశ్యప్ శ్రీనివాస్ కి దర్శకుడిగా మంచి ఫ్యూచర్ ఉందని చెప్పాలి. క్లైమాక్స్ లో సెకండ్ పార్ట్ కి ఇచ్చిన లీడ్ కూడా చాలా బాగుంది. ఇక పవన్ సాధినేని ఈ ప్రాజెక్టుకి అండగా నిలబడి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం కూడా ప్లస్ అయ్యింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాటోగ్రాఫర్ కూడా ఫుల్ మార్క్ స్కోర్ చేశాడు అని చెప్పాలి. ఇక స్వీకర్ అగస్తి సంగీతంలో రూపొందిన పాటలు అన్నీ చాలా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమా మూడ్ కి తగ్గట్టు పర్ఫెక్ట్ గా ఉంటుంది.

Gaayapadda Simham Movie Review and Rating

విశ్లేషణ: అమెరికాలో ఇబ్బంది పడుతున్న తెలుగు యువత గురించి సినిమాలో ప్రస్తావించడమే కాకుండా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ఈ సినిమాలో వాడటం అనేది ఓ డేరింగ్ స్టెప్. ఇలాంటి సెన్సిటివ్ కంటెంట్ తో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ అందించడంలో ‘గాయపడ్డ సింహం’ టీమ్ సక్సెస్ అయ్యింది. ఏమాత్రం సంకోచించకుండా ఈ వీకెండ్ కి హ్యాపీగా థియేటర్లలో ఎంజాయ్ చేయదగ్గ సినిమా అనడంలో సందేహం లేదు.

Gaayapadda Simham Movie Review and Rating

ఫోకస్ పాయింట్: అలరించిన సింహం

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Faria Abdullah
  • #Gaayapadda Simham Movie
  • #J. D. Chakravarthy
  • #Kasyap Sreenivas
  • #Maanasa Choudhary

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Kayadu Lohar: కయాదుకి టాలీవుడ్‌లో హ్యాట్రిక్‌ ఫ్లాప్‌… హిట్‌ ఇచ్చే హీరో ఎవరు?

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Chiranjeevi: ఆయన రంగంలోకి దిగాక.. ట్రోలర్స్‌కి కౌంటర్స్‌ పక్కా.. అక్కడ బాస్‌ అమ్మా!

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

Vijay Devarakonda: విజయ్‌ దేవరకొండ లిస్ట్‌లో 2 సినిమాలకు రెడ్‌ టిక్‌.. నెక్స్ట్‌ ఏంటో?

trending news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

40 mins ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

18 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

19 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

20 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version