రాంచరణ్ (Ram Charan) – శంకర్ (Shankar) కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఇప్పటికీ లిమిటెడ్ థియేటర్స్ లో రన్ అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. దిల్ రాజు (Dil Raju) రూ.450 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. బడ్జెట్ తెరపై కనిపించినా.. కంటెంట్ ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించకపోవడం వల్ల మొదటి షోతోనే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ కొంచెం పర్వాలేదు అనిపించినా..
తర్వాత ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) ‘డాకు మహారాజ్’ ల (Daaku Maharaaj) పోటీకి నిలబడలేకపోయింది. వంద కోట్ల షేర్ మార్క్ అయితే అందుకుంది కానీ టార్గెట్ దానికి ఆల్మోస్ట్ డబుల్ ఉండటం వల్ల ఈ సినిమా కోలుకోవడం కష్టంగానే ఉంది. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) 13 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 19.17 cr |
సీడెడ్ | 10.38 cr |
ఉత్తరాంధ్ర | 10.35 cr |
ఈస్ట్ | 6.25 cr |
వెస్ట్ | 4.09 cr |
కృష్ణా | 5.28 cr |
గుంటూరు | 6.23 cr |
నెల్లూరు | 3.60 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 65.35 cr |
కర్ణాటక | 4.88 cr |
తమిళనాడు | 3.59 cr |
కేరళ | 0.26 cr |
ఓవర్సీస్ | 14.07 cr |
నార్త్ | 14.28 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 102.43 cr (షేర్) |
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు రూ.250 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.255 కోట్లు షేర్ ను రాబట్టాలి. 13 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమాకు రూ.102.43 కోట్ల షేర్ వచ్చింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.152.57 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.