Vishwak Sen: ఒక పక్క బాలయ్య డాన్స్.. మరోపక్క విశ్వక్ సేన్ స్మోకింగ్.. వీడియో వైరల్!

మాస్ క దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) ఇప్పుడు యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న హీరో. ఎలాంటి పాత్రనైనా అద్భుతంగా పోషించగలడు. తన బెస్ట్ ఇవ్వగలడు. స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కూడా ఇప్పుడున్న యంగ్ హీరోలందరికంటే టాలెంటెడ్ అని చెప్పాలి. ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindhi) నుండి ఇతని గ్రాఫ్ పెరుగుతూనే ఉంది. ‘హిట్’ (HIT: The First Case) ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ (Ashoka Vanamlo Arjuna Kalyanam) ‘గామి’ (Gaami) వంటి హిట్లతో సూపర్ ఫామ్లో ఉన్నాడు విశ్వక్ సేన్. త్వరలో ‘లైలా’ (Laila) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

Vishwak Sen

ఈ సినిమాలో అతను లేడీ గెటప్లో కనిపించబోతుండటం అనేది విశేషంగా చెప్పుకోవాలి. దీంతో పాటు మరో అరడజను ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. 2027 వరకు విశ్వక్ సేన్ కాల్షీట్స్ ఖాళీగా లేవు. ఇదిలా ఉంటే.. విశ్వక్ సేన్ ఒకప్పుడు వివాదాల్లో కూడా ఉంటూ వార్తల్లో నిలిచేవాడు. అతని సినిమాల పబ్లిసిటీ కోసం కూడా కాంట్రోవర్సీలు లేపేవాడు. ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా టైంలో అతను చేసిన పబ్లిసిటీ స్టంట్లు.. పెద్ద వివాదానికి తెరలేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వివాదాలకు కొంచెం దూరంగా ఉంటూ వస్తున్నాడు విశ్వక్ సేన్.

అయితే ఇతని స్పీచ్లు ఏదో ఒకరకంగా హాట్ టాపిక్ అవుతూనే ఉంటాయి. అలాగే పలు ఇంటర్వ్యూల్లో చేసే కామెంట్స్ కూడా..! ‘మెకానిక్ రాకీ’ (Mechanic Rocky) టైంలో ‘వంద కోట్లు పారితోషికం తీసుకోవాలని ఆశ ఉన్నట్టు’ విశ్వక్ చేసిన కామెంట్లు పెద్ద వైరల్ అయ్యాయి. ఇదిలా ఉండగా.. ఇటీవల ‘డాకు మహారాజ్’  (Daaku Maharaaj) పార్టీ జరిగింది. ఇందులో ఓ పక్క బాలయ్య (Nandamuri Balakrishna) – ఊర్వశి (Urvashi Rautela) డాన్స్ చేస్తుంటే.. మరోపక్క విశ్వక్ సేన్ హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్ వెనుక సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఫ్యాన్స్ వార్స్ వల్ల సాంగ్స్ అలా.. లిరిసిస్ట్ కేకే కామెంట్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus