Game Changer: అప్పుడెప్పుడో అన్నారు… ఇప్పుడు రిలీజ్‌ చేస్తారట… ఇదేం ‘గేమ్‌’ ఛేంజర్‌!

Advertisement

‘జరగండి… జరగండి’ సాంగ్‌… ఎక్కడో విన్నట్లుంది ఉంది కదా ఈ పాట. అయితే పాట మొత్తం వినలేదు, చూడలేదు కాదు. దీని గురించి అయితే చాలా రోజులే విని ఉంటారు, చదివి ఉంటారు కూడా. (Game Changer) ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాలోని ఈ పాటను లిరికల్‌ వీడియోను రిలీజ్‌ చేస్తామని చాలా నెలల క్రితం టీమ్‌ అనౌన్స్ చేసింది. అయితే ఏమైందో ఏమో ఆ తర్వాత పాట రాలేదు. దాని వెనుక ‘లీకు’ కథలు ఉన్నాయనేది సారాంశం. అయితే ఇప్పుడు మరోసారి ‘జరగండి’ అంటున్నారు. అవును మళ్లీ ఆ పాట ముచ్చట వినిపిస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) హీరోగా అగ్ర దర్శకుడు శంకర్ (Shankar) తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజ‌ర్‌’. చాలా కాలంగా రూపొందుతున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు (Dil Raju) నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘జరగండి..’ పాట గురించి చాలా నెలలుగా వింటూనే ఉన్నాం. సినిమాలో చాలా కాస్ట్లీ సాంగ్‌ ఇదని టీమ్‌ మాట. అందుకే ఆ మధ్య ఘనంగా రిలీజ్‌ చేద్దాం అనుకున్నారు. కానీ అప్పటికే పాట లీక్‌ అవ్వడం, వివిధ కారణాల వల్ల వాయిదా వేసేశారు. ఇప్పుడు మళ్లీ దానికి ముహూర్తం పెట్టారు అంటున్నారు.

గతేడాది రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ‘గేమ్ ఛేంజ‌ర్‌’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్‌ చేయగా… ఇప్పుడు ఈ పాట వస్తుంది అంటున్నారు. అంటే మార్చి 27న అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పాటను చూడొచ్చన్నమాట. గతేడాది దీపావళికి అనుకున్నది ఇప్పుడు జరుగుతుందన్నమాట. ఆ పాట కోసం సుమారు రూ. పది కోట్లు ఖర్చు చేశారని అప్పట్లో వార్తలొచ్చాయి. అలాగే (S.S.Thaman) తమన్‌ బీట్‌, చరణ్‌ – కియారా (Kiara Advani) ఆట భలేగా ఉంటాయి అని టాక్‌.

ఇక ‘గేమ్‌ ఛేంజర్‌’ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో ప్రతిష్ఠాత్మక 50వ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. త్వరలోనే పాన్ ఇండియా రేంజిలో సినిమాను రిలీజ్‌ చేస్తారట. అయితే సరైన డేట్ కోసం ఎదురుచూస్తున్నారట. మే బీ మార్చి 27న ఈ విషయంలో క్లారిటీ వస్తుంది అంటున్నారు.

ఇంటర్వ్యూ : ‘గామి’గురించి డైరెక్టర్ విద్యాధర్ కాగిత చెప్పిన ఆసక్తికర విషయాలు.!

ఇంటర్వ్యూ : ‘భీమా’ గురించి గోపీచంద్ చెప్పిన ఆసక్తికర విషయాలు
రోడ్డుపై యాంకర్ ఝాన్సీ చెత్త సేకరించడానికి కారణాలివేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Also Read

latest news