Game Changer: ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ఆన్ లొకేషన్ పిక్!

ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు. కాబట్టి అభిమానులు చిరు నెక్స్ట్ సినిమాల అప్డేట్స్ తో పాటు రాంచరణ్ సినిమాల అప్డేట్స్ ను కూడా ఆశించారు. చిరు సినిమాల అప్డేట్స్ వచ్చాయి కానీ .. చరణ్ సినిమాల అప్డేట్స్ ఏవీ రాలేదు. మిగిలిన మెగా హీరోల అప్డేట్లు కూడా ఏమీ రివీల్ కాలేదు. అన్నీ ఎలా ఉన్నా.. శంకర్ – చరణ్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘గేమ్ ఛేంజర్’ అప్డేట్ వస్తుందని అంతా ఆశపడ్డారు.

‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ సోలో హీరోగా రూపొందుతున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ఇది. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. కానీ చిరు బర్త్ స్పెషల్ గా ఎటువంటి అప్డేట్ రాలేదు. నిర్మాత దిల్ రాజు కూడా నాకు సంబంధం లేదు.. మొత్తం శంకర్ గారి చేతుల్లోనే ఉంది అన్నట్టు నిన్న ‘గాండీవదారి అర్జున’ ప్రెస్ మీట్లో మాట దాటేశారు. శంకర్ మాత్రం తన ఫస్ట్ ప్రిఫరెన్స్ మొత్తం.. ‘ ఇండియన్ 2 ‘ సినిమాకి ఇస్తున్నట్టు టాక్ నడుస్తుంది.

ఆ సినిమా షూటింగ్ నెల రోజులు చేస్తే.. ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ వారం రోజులు చేస్తున్నారని.. పైగా చెన్నై నుండి హైదరాబాద్ రాకుండా కూడా వేరే డైరెక్టర్స్ తో షూటింగ్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరిగింది. దిల్ రాజు కెరీర్లో ఏ డైరెక్టర్ తో కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వలేదు అని వినికిడి. ఇదిలా ఉండగా.. ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ఆన్ లొకేషన్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఓ సాంగ్ కి సంబంధించినది

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus