Game Changer: చరణ్ శంకర్ కాంబినేషన్ మూవీ విషయంలో జరగబోయేది ఇదేనా?

రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ ఇప్పటికే 70 శాతం పూర్తైంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండగా ఈ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. చరణ్ కు జోడీగా ఈ సినిమాలో కియారా అద్వానీ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి మరో హీరోయిన్ గా నటిస్తుండటం గమనార్హం. చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారు.

ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతోందని జోరుగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. శ్రీ వేంకటేశ్వర సినిమాస్ తో పాటు జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తుండటం గమనార్హం. 350 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. చరణ్ శంకర్ కాంబో మూవీ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఆచార్య సినిమా విడుదలైన రెండున్నరేళ్ల తర్వాత ఈ సినిమా రిలీజ్ కానుంది.

రామ్ చరణ్ త్వరగా గేమ్ ఛేంజర్ సినిమాను పూర్తి చేసి బుచ్చిబాబు సినిమాతో బిజీ కానున్నారని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత చరణ్ నటించిన ఈ సినిమానే పాన్ ఇండియా సినిమాగా రిలీజవుతోంది. ఈ సినిమా పాటల కోసం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఖర్చైందని తెలుస్తోంది.

గేమ్ ఛేంజర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఉండనుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు. గేమ్ ఛేంజర్ సినిమా కోసం చరణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus