సాయిపల్లవి టైటిల్ రోల్ పోషించిన మరో మూవీ ‘గార్గి’. తమిళంలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఏక కాలంలో రిలీజ్ అయ్యింది. తమిళంలో సూర్య.. తెలుగులో రానా సమర్పకులు గా వ్యవహరించారు. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ మూవీని బ్లాక్ జినీ – మై లెఫ్ట్ ఫూట్ ప్రొడక్షన్ పై రవిచంద్రన్ రామచంద్రన్ నిర్మించారు. జూలై 15న విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
కానీ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా నిరాశపరిచింది. పాజిటివ్ టాక్ సంపాదించుకున్నప్పటికీ ఈ చిత్రం మొదటి రోజే చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి అంటే ఇప్పటి బాక్సాఫీస్ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.33 cr |
సీడెడ్ | 0.17 cr |
ఉత్తరాంధ్ర | 0.18 cr |
ఈస్ట్ | 0.05 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.06 cr |
కృష్ణా | 0.08 cr |
నెల్లూరు | 0.03 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.95 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.05 cr |
ఓవర్సీస్ | 0.05 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 1.05 cr |
‘గార్గి’ చిత్రం తెలుగు వెర్షన్ కు రూ.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం రూ.1.05 కోట్ల షేర్ ని మాత్రమే కలెక్ట్ చేసింది.దీంతో బిజినెస్ మీద రూ.1.95 కోట్ల నష్టాలను మిగిల్చిన ఈ మూవీ కమర్షియల్ ఫెయిల్యూర్ అని చెప్పాలి. మరి తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేసింది అనేది తెలీదు కానీ.. తెలుగు వెర్షన్ పరంగా మాత్రం నష్టాలనే మిగిల్చింది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ వంటి పెద్ద సంస్థ సపోర్ట్ ఉన్నా ఈ మూవీకి కలిసి రాలేదు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!