భారీ బిజినెస్ చేస్తున్న శాతకర్ణి!!!

టాలీవుడ్ లో రాజసానికి నందమూరి వంశం పెట్టింది పేరు. అయితే ఆ వంశం నుంచి వచ్చిన హీరోలు లెక్కల్లో తక్కువగా ఉన్నా..బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే విషయంలో మాత్రం ఏమాత్రం వెనకడుగు వెయ్యరు. ఇదిలా ఉంటే తాజాగా నట సింహం నందమూరి బాలయ్య ప్రతిష్టాత్మకంగా చేస్తున్న 100వ చిత్రం పై రోజుకో వార్త సంచలనం సృష్టిస్తుంది. మొదట్లో ఈ సినిమాపై పెద్దగా అంచనాలు ఏమీ లేకపోవడంతో అందరూ మామూలు సినిమాగా ఆలోచించి ఈ సినిమాని లైట్ తీసుకున్నారు. అయితే ఈ సినిమా ఫర్స్ట్ లుక్ చూడగానే ప్రేక్షకులకి వైబ్రేషన్స్ పుట్టుకొచాయి….ఇక అక్కడ నుంచి మొదలయిన బాలయ్య ప్రభంజనం ఈ సినిమా ఫర్స్ట్ టీజర్ తో మరింత రెట్టింపు అవ్వడమే కాకుండా సంచలనాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయ్యింది….ఇక ఆ టీజర్ లో బాలయ్య రౌధ్రం చూశాక…ఈ సినిమా స్టామినా ఏంటో అర్ధం అయ్యింది.

ఇదిలా ఉంటే అదే క్రమంలో….ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరగడంతో ఈ సినిమా బిజినెస్ పీక్స్ లో ఉంది…చాలా డిమాండ్ పలుకుతూ ఉంది కూడా….ఇప్పటికే నైజాం , సీడెడ్ హక్కుల్లో సంచలనం సృష్టించిన గౌతమిపుత్ర శాతకర్ణి తాజాగా కృష్ణా , గుంటూరు జిల్లా హక్కుల విషయంలో మరింత సంచలనం సృష్టించింది . కృష్ణా జిల్లా హక్కుల కోసం 3.60 కోట్ల రేటు పలకగా , గుంటూరు హక్కుల కోసం 4.5 కోట్లు పలికి ఆశ్చర్యానికి గురి చేసింది. చారిత్రాత్మక చిత్రం కనుక తెలుగు రాష్ట్ర ప్రజలే కాకుండా యావత్ భారత దేశం చూడదగ్గ చిత్రం అని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ సినిమా సంక్రాంతి బరిలో పోటీకి దిగుతూ ఉండడంతో మిగిలిన సినిమాల నిర్మాతలు కాస్త ఆలోచనలో పడినట్లు సమాచారం…చూద్దాం ఈ సినిమా ఎంతటి సంచలనాలు సృష్టిస్తుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus