వ్యూహాత్మకంగా శాతకర్ణి టీమ్!!!

బాలయ్య గర్జించాడు….నిన్న తిరుపతి నగరంలో అంగరంగా వైభవంగా జరిగిన నందమూరి నట సింహం 100వ చిత్రం ‘గౌతామీ పుత్ర శాతకర్ణి’ ఆడియో వేడుక నభూతో న భవిష్యత్ అన్నలుగా జరిగింది…అతిరధ మహారధులు, రాజకీయ నాయకులు హాజరయిన ఈ వేడుక భ్రహ్మాండంగా జరిగి నందమూరి అభిమానులను ఉత్తేజ పరిచింది…అయితే అదే క్రమంలో ఈ వేడుక కోసం నందమూరి అభిమానులు ఎంతగా ఎదురు చూసారో…అదే క్రమంలో మెగా కాంపౌండ్ కూడా ఈ వేడుకలో బాలయ్య సైన్యం సినిమా విడుదల తేదీని తెలుపుతుంది, అలా తెలిపిన వెంటనే తమ సినిమా ఖైదీ విడుదల తేదీని కూడా ప్రకటించాలని ఆశపడ్డాడు…అయితే ఆ ఆశలు అన్నీ తారుమారు అయ్యాయి…ఇంతకీ విషయంలోకి వెళితే…సంక్రాంతి రేసుకు పోటీ పడుతున్న ఈ రెండు సినిమాలు ఒకేరోజు విడుదల కావడం చిరంజీవికి ఏమాత్రం ఇష్టం లేదు.

తన ‘ఖైదీ నెంబర్ 150’ ని ‘శాతకర్ణి’ విడుదల తేదీ కంటే ఒకరోజు ముందు కానీ లేదంటే ఒకరోజు వెనుక కానీ విడుదల చేయాలి అన్న ఉద్దేశ్యంలో ఉన్నాడు చిరు…అదే క్రమంలో ఏ వేడుకలో శాతకర్ణి విడుదల తేదీ పై ఒక స్పష్టత వస్తుంది అని అనుకున్నాడు చిరు….అయితే ఎన్నో విషయాలను మాట్లాడిన క్రిష్ ‘శాతకర్ణి’ రిలీజ్ డేట్ విషయంలో వ్యూహాత్మక మౌనం పాటించడం మెగా కాంపౌండ్ ను ఆశ్చర్య పరుస్తున్నట్లు టాక్.  దీనితో తన ‘ఖైదీ’ రిలీజ్ డేట్ ను ముందుగా ప్రకటింపచేయాలి అన్న ఎత్తుగడలో ‘శాతకర్ణి’ టీమ్ ఉంది అన్న విషయం ఇప్పటికే మెగా కాంపౌండ్ కు సూచన ప్రాయంగా అర్ధం అయిపోయింది అని తెలుస్తోంది. ఇదంతా పక్కన పెడితే…జనవరి 4న జరగబోతున్న ‘ఖైదీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సంక్రాంతి రేస్ కు సంబంధించి మొట్టమొదటి శంఖారావం పూరించవలసిన పరిస్థితి చిరంజీవికి ఏర్పడింది. మరి చూడాలి చిరు ఏం చేస్తాడో…

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus