విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ సినిమా..?

ఓవైపు శింబు లాంటి యువ హీరోలతో ప్రేమకథాచిత్రాలు చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోలను పోలీస్ ఆఫీసర్లుగా మార్చి యాక్షన్ సినిమాలు చేస్తుంటారు గౌతమ్ మీనన్. అందులోనూ లవ్, రొమాన్స్ ఉండాల్సిందే. ఇది గౌతమ్ శైలి. ఇక విక్రమ్ వద్దకొస్తే.. సినిమాకో మనిషిలా మారిపోతుంటారు. పాత్రలు పెరిగే కొద్దీ ఆయన రూపాలు మారిపోతుంటాయి. ఇలా తనను తాను కష్టపెట్టుకుంటూ ప్రేక్షకులకు కొత్తదనం పంచడం విక్రమ్ స్టైల్. అలాంటిది ఈ ఇద్దరి కలయికలో సినిమా వస్తే…ప్రస్తుతం అదే జరుగుతోంది. విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ ఓ కథను సిద్ధం చేశారని కోలీవుడ్ వర్గాలు కబురందించాయి.

గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ రేపు తెరమీదికొస్తోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా ఓ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. దీని తర్వాత విక్రమ్ సినిమా చేయాలన్నది గౌతమ్ ప్లాన్. అటు విక్రమ్ కూడా తన కష్టానికి తగ్గ ఫలితం రావటం లేదని భావించి మళ్ళీ మాస్ కథలవైపు దృష్టి సారిస్తున్నారు. ‘సామి’ సినిమాతో తనకు తొలి కమర్షియల్ విజయాన్ని ఇచ్చిన హరితో ‘సామి2’ చేయనున్న విక్రమ్. గౌతమ్ మీనన్ యాక్షన్-థ్రిల్లర్ కథపై సానుకూలంగా స్పదించారట. అయితే ‘సింగం3’ విడుదల, ప్రచార కార్యక్రమాలు ముగిస్తే కానీ హరి కొత్త సినిమా మొదలెట్టరు. అది పూర్తయ్యాక ‘డోంట్ బ్రీత్’ రీమేక్ కోసం చియాన్ సన్నాహాలు చేసుకుంటున్నారు. మరి గౌతమ్ సినిమా కోసం ఆ సినిమాని వాయిదా వేస్తారా లేక గౌతమ్ సినిమాని పూర్తి చేసి రీమేక్ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్తారా అన్నది తేలాల్సి ఉంది.

https://www.youtube.com/watch?v=K8IMqA1C-YY

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus