Geetha Subramanyam Review: ‘గీతా సుబ్రహ్మణ్యం-3’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

  • May 8, 2023 / 06:19 PM IST

Cast & Crew

  • సుప్రజ్‌ రంగా (Hero)
  • అభిజ్ఞ్య ఉతలూరు (Heroine)
  • సునైన బదమ్, రాకేష్ రచ్చకొండ తదితరులు (Cast)
  • శివ సాయి వర్థన్‌ (Director)
  • రాహుల్ తమడ, సాయి దీప్ రెడ్డి (Producer)
  • పవన్‌ (Music)
  • శ్రీధర్‌ కేవీ (Cinematography)
  • Release Date : మే 5, 2023

ఓటీటీల హవా పెరిగిన తర్వాత.. వెబ్ సిరీస్ లు కుప్పల్లా వచ్చి పడుతున్నాయి. అలా అని అన్ని వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయా? అంటే కచ్చితంగా అవునని చెప్పలేము. కానీ `గీతా సుబ్రమణ్యం` సిరీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆల్రెడీ దీని ఫ్రాంచైజీ లో భాగంగా రెండు సీజన్ లు వచ్చాయి.’గీతా సుబ్రహ్మణ్యం’ ‘గీతా సుబ్రహ్మణ్యం 2’ వంటి రెండు సిరీస్ లు సూపర్ సక్సెస్ అయ్యాయి. తాజాగా 3వ సీజన్ వచ్చింది. ‘గీతా సుబ్రహ్మణ్యం 3’ టైటిల్ తో వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేర అలరించిందో ఓ లుక్కేద్దాం రండి :

కథ : హైదరాబాద్‌లో ఓ పెద్ద సాఫ్ట్ వేర్‌ కంపెనీ. అందులో గీతా(అభిజ్ఞ్య), సుబ్రమణ్యం(సుప్రజ్‌) ఎంప్లాయిస్ గా చేరతారు. వీరికి పురుష్‌ టీమ్‌ లీడర్‌. ఈ కంపెనీలో ఓ కఠినమైన రూల్ ఉంటుంది. అదేంటి అంటే.. ఇందులో పనిచేసే ఎంప్లాయిస్‌ లవ్‌లో పడకూడదు.. రిలేషన్ షిప్స్ వంటివి పెట్టుకోకూడదు. ఆ రూల్ ను అధిగమిస్తే జాబ్ ఊడుతుంది. ఆ రూల్‌ తెలీక ఓ జంట లవ్ లో పడి రాజీనామా చేయాల్సి వస్తుంది. దీంతో అక్కడి ఎంప్లాయిస్ అలెర్ట్ అవుతారు.

అయినా సరే గీతా, సుబ్రమణ్యం లవ్‌ లో పడతారు. సహజీవనం మొదలుపెడతారు. ఆఫీస్‌లో తెలీకుండా మ్యానేజ్‌ చేయొచ్చు అని ఆజ్ఞను అతిక్రమిస్తారు. ఇద్దరూ కలిసి ఓకే ఫ్లాట్‌లో ఉంటూ ఆఫీస్ లో మ్యానేజ్‌ చేస్తుంటారు. వీరి మధ్య జరిగే రొమాన్స్, అల్లరి, చిన్న చిన్న గొడవలు.., చివరికి వీరి మ్యాటర్ ఆఫీస్ లో తెలిశాక ఏం జరిగింది అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : అభిజ్ఞ్య ఉతలూరు, సుప్రజ్‌ రంగా ఇద్దరూ కూడా తమ మార్కు నటనతో మెస్మరైజ్ చేశారు. లవ్, రొమాన్స్, ఎమోషన్స్.. వంటి వాటిని చక్కగా పలికించారు. సునైన బదమ్, రాకేష్ రచ్చకొండ పాత్రలు కావాల్సినంత వినోదాన్ని పంచాయని చెప్పవచ్చు. ఆఫీస్ లో కనిపించే స్టాఫ్ అంతా కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ అంటే ప్రేక్షకుల్లో తెలియని ఓ నెగిటివ్ ఫీలింగ్ ఉంది. వెబ్ సిరీస్ అంటేనే మితి మీరిన శృంగారం, బూతులు లేదా అడల్ట్ కంటెంట్ డైలాగులు… ఇదే ప్రధానాంశం అన్నట్టు వారు భావిస్తున్నారు. అందుకు కారణాలు లేకపోలేదు. అలాంటివి పెడితేనే వ్యూయర్ షిప్ వస్తుందని చాలా మంది మేకర్స్ వాటినే నమ్ముకున్నారు. నిజానికి రెండున్నర గంటల్లో చెప్పలేని భావోద్వేగాలను 5,6 గంటల పాటు..

మనల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్లి చెప్పడం అన్న విషయాన్ని ‘గీతా సుబ్రహ్మణ్యం 3’ తో శివ సాయి వర్థన్‌ చాటి చెప్పాడు. ప్రతి సన్నివేశాన్ని ఎంతో చక్కగా ఆవిష్కరించాడు. పవన్‌ సంగీతం, వినయ్‌ ఎడిటింగ్‌, శ్రీధర్‌ కేవీ సినిమాటోగ్రఫీ అన్నీ కూడా చక్కగా కుదిరాయి. ‘తమడ మీడియా’ సంస్థ పై రాహుల్, సాయి దీప్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. క్వాలిటీ విషయంలో వాళ్ళు ఎక్కడా తగ్గకుండా ఖర్చు చేసినట్లు ప్రతి ఫ్రేమ్ చెబుతుంది.

విశ్లేషణ : 8 ఎపిసోడ్ ల (Geetha Subramanyam) ‘గీతా సుబ్రహ్మణ్యం 3’ వెబ్ సిరీస్ ‘ఆహా’లో అందుబాటులో ఉంది. ఆధ్యంతం వినోదాత్మకంగా సాగే ఈ సిరీస్ ఎక్కడా బోర్ అనిపించదు… హ్యాపీగా అలాగే కచ్చితంగా చూసెయ్యండి.

రేటింగ్ : 3/5

Click Here To Read in ENGLISH

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus