Ghattamaneni: ఘట్టమనేని థర్డ్ జెనరేషన్.. వారసత్వం నిలబెట్టేదెవరు?

​సూపర్ స్టార్ కృష్ణ లెగసీని సూపర్ స్టార్ మహేష్ బాబు విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి సుధీర్ బాబు కూడా హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు, ఆ ఫ్యామిలీ నుంచి ఏకంగా మూడో తరం రంగ ప్రవేశానికి సిద్ధమవుతోంది. ఇది వినడానికి చాలా ఎగ్జైటింగ్‌గా ఉన్నా, దీని వెనుక పెద్ద బాధ్యత, అంతకు మించిన ప్రెషర్ ఉంటాయి.

Ghattamaneni

​ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి ఒకరిద్దరు కాదు, ఏకంగా అరడజను (ఆరుగురు) మంది యంగ్ టాలెంట్స్ సినిమా ఎంట్రీకి రెడీ అవుతున్నారట. ఈ లిస్ట్ చూస్తుంటేనే, ఆ ఫ్యామిలీ సినిమా ఇండస్ట్రీకి ఎంతలా కనెక్ట్ అయి ఉందో అర్థమవుతుంది.

​ఈ లిస్ట్‌లో ముందుగా వినిపిస్తున్న పేరు మహేష్ బాబు సోదరి మంజుల కుమార్తె జాహ్నవి ఘట్టమనేని. ఈ అమ్మాయి హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడానికి కావాల్సిన యాక్టింగ్, డ్యాన్స్ ట్రైనింగ్ అన్నీ పూర్తి చేసుకుని, ప్రస్తుతం కథలు వింటోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. అలాగే, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు పిల్లలు జయకృష్ణ, భారతి ఘట్టమనేని (హీరోయిన్‌గా) కూడా ఎంట్రీకి సిద్ధంగా ఉన్నారని అంటున్నారు.

​ఇక సుధీర్ బాబు ఇద్దరు కొడుకులు చరిత్, దర్శన్‌లు కూడా హీరోలుగా పరిచయం కాబోతున్నారని టాక్ నడుస్తోంది. అందరికంటే ముఖ్యంగా, సూపర్ స్టార్ మహేష్ బాబు కొడుకు గౌతమ్ ఘట్టమనేని కూడా ఆల్రెడీ ఫిల్మ్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని సమాచారం. ‘1 నేనొక్కడినే’ సినిమాలో చిన్నప్పటి మహేష్‌గా కనిపించి గౌతమ్ అప్పుడే ఇంప్రెస్ చేశాడు.

​ఇంత మంది ఒకే ఫ్యామిలీ నుంచి ఒకేసారి ఇండస్ట్రీకి రావడం అనేది చాలా అరుదు. ఇది ఘట్టమనేని ఫ్యామిలీకి ఉన్న సినిమా ప్యాషన్‌ను చూపిస్తోంది. అయితే, వీళ్లందరి ముందు ఇప్పుడు పెద్ద సవాల్ ఉంది. కృష్ణ, మహేష్ బాబు లాంటి లెజెండరీ స్టార్స్ లెగసీని అందుకోవడం అంత ఈజీ కాదు. స్టార్ కిడ్స్ అనే ట్యాగ్ లైన్ ఉంటుంది కానీ, టాలెంట్ ప్రూవ్ చేసుకోకపోతే ఆడియెన్స్ యాక్సెప్ట్ చేయరు. ఇక ​ఈ ఆరుగురిలో ఎవరు ముందు వస్తారు? ఎవరు క్లిక్ అవుతారు అనేది తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

ఎంత అడిగినా క్లారిటీ ఇవ్వడం లేదు.. ఇదేం లాజిక్‌ రష్మికా.. చెప్పేయొచ్చుగా!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus