Godfather: గాడ్ ఫాదర్ మూవీ వల్ల ఆయనకు ఆఫర్లు పెరగనున్నాయా?

ఫస్ట్ వీకెండ్ వరకు ఊహించని స్థాయిలో గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్లను సొంతం చేసుకోగా వీకెండ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. ఈ సినిమా కలెక్షన్లు తగ్గడానికి వేర్వేరు కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా లూసిఫర్ సినిమాకు రీమేక్ కావడం వల్లే ఈ సినిమా ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదని చాలామంది భావిస్తారు. అయితే మేకర్స్ మాత్రం ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చాయని చెబుతున్నారు.

ఈ సినిమా వల్ల ఎక్కువ బెనిఫిట్ పొందిన వ్యక్తి ఎవరనే ప్రశ్నకు డైరెక్టర్ మోహన్ రాజా పేరు సమాధానంగా వినిపిస్తోంది. హనుమాన్ జంక్షన్ సినిమాతో 20 సంవత్సరాల క్రితం తెలుగులో హిట్ కొట్టిన మోహన్ రాజా ఇప్పుడు గాడ్ ఫాదర్ తో మరో సక్సెస్ ను అందుకున్నారు. కమర్షియల్ గా ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ను అందుకున్నా మోహన్ రాజాకు మాత్రం తెలుగులో కొత్త సినిమా ఆఫర్లు వస్తాయని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

సీనియర్ స్టార్ హీరోలు రీమేక్ సినిమాలపై దృష్టి పెడితే కూడా దర్శకునిగా మోహన్ రాజాను ఎంపిక చేయడానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. గాడ్ ఫాదర్ సినిమా మోహన్ రాజాకు ఎంతో ప్లస్ అయింది. మోహన్ రాజా తర్వాత సినిమా నాగార్జున హీరోగా తెరకెక్కనుంది. ఈ సినిమాతో మోహన్ రాజా సక్సెస్ ను అందుకుంటే మాత్రం ఆయన కెరీర్ కు కచ్చితంగా మరింత బెనిఫిట్ కలుగుతుందని చెప్పవచ్చు.

చాలామంది తెలుగు దర్శకులు తీసుకుంటున్న పారితోషికంతో పోల్చి చూస్తే మోహన్ రాజా రెమ్యునరేషన్ కూడా తక్కువ కావడం గమనార్హం. మోహన్ రాజా తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా మరెన్నో సక్సెస్ లను అందుకుని కెరీర్ ను కొనసాగించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మోహన్ రాజా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సీనియర్ స్టార్ హీరోలతో పని చేయడానికి మోహన్ రాజా కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus