సమంత అలా ప్రేక్షకులను అలరించబోతుందన్న మాట..!

  • April 7, 2020 / 03:40 PM IST

పెళ్ళైన తరువాత సమంత క్రేజ్ డబుల్ అయ్యింది అనేది అందరికీ తెలిసిన సంగతే. గ్లామర్ పాత్రలను కాస్త తగ్గించి.. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే చేస్తూ వరుస హిట్లు అందుకుని సూపర్ స్టార్ రేంజ్ కు చేరిపోయింది. ఇప్పుడు సమంత ఏ సినిమా చేసినా మినిమం గ్యారెంటీ అనే ముద్ర పడిపోయింది. ప్రేక్షకులు కూడా ఈమె నటిస్తే సినిమా హిట్ అనే నమ్మకం పెంచేకున్నారు. ఈ ఏడాది సమంత నుండీ వచ్చిన చిత్రం ‘జాను’. ఈ చిత్రానికి క్రిటిక్స్ నుండీ మంచి స్పందనే లభించింది.

అయితే ఫిబ్రవరి వంటి డ్రై సీజన్… అందులోనూ ’96’ ను తెలుగు ప్రేక్షకులు కూడా చాలా మంది చూసేసారు కాబట్టి కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇదిలా ఉండగా… హైదరాబాద్ టైమ్స్ వారు నిర్వహించిన ‘మోస్ట్ డిజైరబుల్ ఉమెన్’ పోల్ లో టాప్ లో నిలిచింది ఈ బ్యూటీ. దాంతో సమంత ఫ్యాన్స్ కాస్త హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వారి హ్యపినెస్ డబుల్ అయ్యే అవకాశం కూడా ఉందని తెలుస్తుంది.

ఇప్పుడు ఎలాగూ సమంత సినిమాల్లో నటించినా లాక్ డౌన్ కారణంగా విడుదల అవుతాయి అని చెప్పలేము. అయితే ఈమె ఓ వెబ్ సిరీస్ తో తన ఫ్యాన్స్ ను బుల్లితెర పై అలరించనుంది.అవును ‘ఫ్యామిలీ మేన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో సమంత ఓ కీ రోల్ ప్లే చేసింది.అతి త్వరలో ఆ వెబ్ సిరీస్ డేట్ ను ప్రకటించనున్నారట. ఈ సమ్మర్ లు సామ్ ఇలా సందడి చేయనుందన్నమాట.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus