Gopichand Family: శ్రీకాంత్ తమ్ముడు కూతురి పెళ్లిలో గోపీచంద్ ఫ్యామిలీ సందడి .. వైరల్ అవుతున్న ఫోటోలు.!

సీనియర్ హీరో శ్రీకాంత్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నెగిటివ్ రోల్స్ తో కెరీర్ ను ప్రారంభించిన శ్రీకాంత్.. తర్వాత హీరోగా మారి ఎన్నో హిట్ సినిమాల్లో నటించాడు. శ్రీకాంత్ వల్ల టాలీవుడ్లో పాపులర్ డైరెక్టర్స్ గా మారిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎప్పుడూ ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉంటారు శ్రీకాంత్. ఏ ప్రాజెక్టు లేకపోతే వెబ్ సిరీస్ వంటి వాటిలో కూడా నటిస్తూ ఉంటారు. ‘అఖండ’ తో పవర్ ఫుల్ విలన్ గా మారిన శ్రీకాంత్..

మరోపక్క ‘వారసుడు’ వంటి సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూనే.. మరోపక్క పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో కూడా భాగం అవుతున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల శ్రీకాంత్ తమ్ముడు కూతురు అనీష్ పెళ్లి ఘనంగా జరిగింది. ఈ వేడుకలో శ్రీకాంత్ భార్య ఊహ.. అతని పెద్దబ్బాయి రోషన్, అమ్మాయి మేధా, అలాగే చిన్నబ్బాయి రోహన్ సందడి చేశారు.అందరూ కూడా ట్రెడిషనల్ ఔట్ ఫిట్స్ లో బాగా సందడి చేశారు. శ్రీకాంత్ ఫ్యామిలీతో పాటు గోపీచంద్ ఫ్యామిలీ కూడా ఈ వేడుకలో సందడి చేసింది.

శ్రీకాంత్ చెల్లెలి కూతుర్ని గోపీచంద్ (Gopichand) వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ భార్య పేరు రేష్మ. ఈ మధ్యనే గోపీచంద్ – రేష్మ తమ 10వ పెళ్లి రోజు వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్ చేసుకుని వచ్చారు. ఇక శ్రీకాంత్ తమ్ముడు కూతురి పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus