Gorre Puranam Review in Telugu: గొర్రె పురాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • September 21, 2024 / 06:47 PM IST

Cast & Crew

  • సుహాస్ (Hero)
  • NA (Heroine)
  • పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి తదితరులు.. (Cast)
  • బాబీ వర్మ (Director)
  • ప్రవీణ్ రెడ్డి (Producer)
  • పవన్ సీహెచ్ (Music)
  • సురేష్ సారంగం (Cinematography)

వరుస విడుదలలతో ఫుల్ ఫామ్ లో ఉన్న యువ నటుడు సుహాస్ నటించగా ఎలాంటి ప్రమోషన్ లేకుండా ఇవాళ (సెప్టెంబర్ 21) ఉన్నపళంగా విడుదల చేశారు. టీజర్ & ట్రైలర్ మంచి ఆసక్తి రేకెత్తించాయి. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం..!!

Gorre Puranam Review

కథ: హిందూ ముస్లింల నడుమ మత కల్లోలం సృష్టించింది అనే కారణంగా ఏసు అనే గొర్రెను జైల్లో వేస్తారు. అదే జైల్లో ఓ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న రవి (సుహాస్) ఆ గొర్రెకు కాపరిగా వ్యవహరిస్తుంటాడు. రాము నుంచి ఏసుగా పేరు మార్చబడిన గొర్రె కథ ఏమిటి? దాని వల్ల మత కల్లోలాలు చెలరేగడం ఏమిటి? రవి ఎందుకు జైల్లో మగ్గుతాడు? వంటి ప్రశ్నలకు సమాధానమే “గొర్రె పురాణం” చిత్రం.

నటీనటుల పనితీరు: కరెక్ట్ గా ఇంటర్వెల్ కార్డ్ తో తెరపై కనిపించే సుహాస్ కోనిపించే కొద్దిసేపు ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు కానీ.. అతడి క్యారెక్టర్ కు సరైన జస్టిఫికేషన్ లేకపోవడం వల్ల పాత్ర పండలేదు. జడ్జ్ పాత్రలో పోసాని తన రెగ్యులర్ యాక్టింగ్ తో కానిచ్చేయగా, రఘు కారుమంచి కనిపించిన కొద్దిసేపు కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక రాము అలియాస్ ఏసుగా కనిపించిన గొర్రె అందరికంటే ఎక్కువ స్క్రీన్ స్పేస్ తీసుకుంది. ఈ గొర్రె పాత్ర ద్వారా చాలా చెప్పాలనుకున్నాడు దర్శకుడు కానీ.. అది సరిగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రాఫర్ ఒక్కడే కాస్త కష్టపడ్డాడు. గొర్రెను ఫ్రేమ్ లో ఇరికించడానికి, ఆ గొర్రె చుట్టూ లైటింగ్ సెట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. ఉన్నంతలో మంచి అవుట్ పుట్ ఇచ్చింది సినిమాటోగ్రాఫర్ సురేష్ సారంగం ఒక్కడే. పవన్ సీహెచ్ సంగీతం కానీ, ప్రొడక్షన్ డిజైన్ కానీ, ఆర్ట్ వర్క్ కానీ చెప్పుకోదగ్గ విధంగా లేవు.

దర్శకుడు బాబీ వర్మ ఒక మంచి కాన్సెప్ట్ ను తీసుకున్నాడు కానీ దాన్ని డీల్ చేసిన విధానం మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా మీడియా, ప్రభుత్వం, వ్యవస్థ మీద వేసిన వ్యంగ్యాస్త్రాలు ఏమాత్రం పేలలేదు. సో, దర్శకుడిగా, కథకుడిగా బాబీ వర్మ విఫలమయ్యాడు.

విశ్లేషణ: వ్యంగ్యం అనేది ఒక అద్భుతమైన అస్త్రం. ఎంతటి సీరియస్ అంశాన్నైనా సరే వ్యంగ్యంగా చెప్పొచ్చు. ఈవీవీ సత్యనారాయణ ఈ వ్యంగ్యాన్ని వైవిధ్యంగా ఆయన సినిమాల్లో వాడేవారు. “గొర్రె పురాణం” సినిమాలో కూడా ఒక సీరియస్ విషయాన్ని వ్యంగ్యంగా సమాజం, మీడియా, కోర్టులు, ప్రభుత్వాలు భుజాలు తడుముకునే స్థాయిలో తెరకెక్కించాలనుకున్నాడు దర్శకుడు బాబీ వర్మ, కానీ వ్యంగ్యం అనేది అర్థవంతంగా మాత్రమే కాదు అలరించే విధంగానూ ఉండాలీ అనే విషయాన్ని విస్మరించాడు. అందువల్ల 143 నిమిషాల సినిమా కూడా సాగదీసినట్లుగా ఉంటుంది. ముఖ్యంగా గొర్రె పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసం దాదాపు 20 నిమిషాలు వేస్ట్ చేయడం అనేది పెద్ద మైనస్. సుహాస్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీని ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే విధంగా తెరకెక్కించకపోవడం వల్ల ఆ పాయింట్ కు కూడా ఎవరు కనెక్ట్ అవ్వలేకపోయారు. ఓవరాల్ గా.. ఈ గొర్రె పురాణం అటు ఆలోజింపచేయలేక, ఇటు ఆకట్టుకోలేక ఢీలా పడిపోయింది.

ఫోకస్ పాయింట్: ఈ పురాణంలో చాలా పేజీలు మిస్సింగ్!

రేటింగ్: 1/5

Rating

1
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus