“GST”మూవీ “ఫస్ట్ కీ” లాంచ్ చేసిన కాటికాపరి!

“తోలుబొమ్మల సిత్రాలు” బ్యానర్ పై కొమారి జానకిరామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం G S T (God Saithan Technology). ఈచిత్రం “ఫస్ట్ కీ”ని కాటికాపరి, లిమ్కాబుక్ ఆఫ్ నేషనల్ 2011 రికార్డ్స్ పురస్కార గ్రహీత, శ్రీ డా.పట్ట పగలు వెంకట్రావు గారు లాంచ్ చేసారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ …. కాటికాపరి పట్టపగలు వెంకట్రావు మాట్లాడుతూ…” తోలుబొమ్మల సిత్రాలు”బ్యానర్ పై నిర్మించిన GST మూవీ “ఫస్ట్ కీ” నా చేతుల మీదుగా లాంచ్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈసినిమా బ్రహ్మండంగా ఆడాలని కోరుకుంటున్నాను. GST అనగానే ట్యాక్స్ పరంగా ఏదైనా కొత్త విషయాలు చెబుతారేమో, బహుశా అటువంటి సినిమా తీసారేమోననే ఆలోచన మనందరికీ వస్తుంది. కానీ..అది కానే కాదు.”GST” అంటే G for God, S for Saithan, T for Technology అనేది ఈసినిమా. అతిమిక్కిలి సెంటిమెంట్ ఏదైనా వుoదంటే అది సినిమా ఫీల్డె.ఆ సినిమా ఫీల్డ్ నుంచి వచ్చి, రాజమండ్రి లో ఒక స్మశాన వాటికలో.. కాటికాపరి పట్టపగలు వెంకట్రావు గారితో ఈ GST మూవీ “ఫస్ట్ కీ”ని రిలీజ్ చేయించడమనే దైర్యం డైరెక్టర్ జానకిరామ్ కి ఇచ్చినందుకు భగవంతున్నీ నిజంగా చాలా అభినందిస్తున్నాను. ఏంచేతంటే…కీ ఓపెన్ చేసిన ఈప్లేస్ లో “గాడ్”..ఇక్కడే దేవుడున్నాడు., “సైతాన్ ” ఇక్కడే వుంది., టెక్నాలజీ మనలో వుంది, మన ఆలోచన విధానంలో వుంది.ఇవాళ ప్రతి వాడికి కూడా ఏదో ఒక మూఢనమ్మకం. సమాజంలో 90% మనుషులు మూఢ నమ్మకాలు, ముహూర్తాలు ఏవేవో రకరకాల నమ్మకాలతో ప్రయాణం సాగిస్తున్నారు.అంతకంటే కూడా చదుకున్న వాళ్ళు, చదువులేని వాళ్ళు,సంస్కార హీనులు రకరకాలుగా వుంటున్నారు ఈ సమాజంలో. టెక్నాలజీ గురించి మనం ఆలోచించట్లేదు.టెక్నాలజీ పరంగా మనం వెళ్లాలనుకుంటే జీవితం ఎంతో బాగుంటుంది. ఈమధ్య కాలంలో మనం చూసాం.మాధనపల్లిలో ఏం జరిగింది? ఎంతో బాగా చదువుకున్న భార్యభర్తలు ఇద్దరు కూడా,పిల్లలతో కుటుంబం అందరూ వెల్ ఏజీకేటెడ్. ఎంత మూఢ నమ్మకం..? మరణిస్తే మళ్లీ బతికెంత సైన్స్ ని వాళ్ళు అవగాహన చేసుకున్నారా..? ఈ సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకున్నారు వాళ్ళు. ఇది కరెక్ట్ కాదు.ఈపద్దతి చూసుకుంటూపోతే..మా జానకిరామ్ తీసిన సినిమాను మాత్రం ఖచ్చితంగా మీరందరూ ఆదరిస్తారు. అందులో అనుమానమే లేదు.ఎందుకంటే.. ఒక్క క్షణం కూడా రెప్ప ఆర్పకుండా తీసిన సినిమా ఇది.ఈసినిమా ని మీరందరు కూడా చూసి… “దేవుడు”కావాలా మీకు? “దెయ్యం”కావాలా మీకు? టెక్నాలజీ పరంగా మన జీవితాన్ని గడుపుదామా… ఒక్కసారి ఆలోచించుకొని, మీరు జానకిరామ్ ఏ మెసేజ్ ఇచ్చారో దానికి రిప్లై ఇవ్వాల్సిన సినిమా. ఈసినిమా చూసి ఖచ్చితంగా మీరు రిప్లై ఇస్తారని ఆశిస్తూ..ఈ సినిమా ఖచ్చితంగా పరమేశ్వరుని ఆశీస్సులతో బ్రహ్మాండంగా ఆడి, జానకిరామ్ మరెన్నో సినిమాలు బాగా తీయాలని, మంచి దర్శకుడిగా ఎదగాలని కోరుకుంటూ.. జానకిరామ్ కి నా ఆశీస్సులు, పరమేశ్వరుని యొక్క దీవెనలు ఈ స్మశాన వాటికలో లభించాలని కోరుకుంటున్నానని పట్టపగలు వెంకట్రావు అన్నారు.

దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ ..ముందుగా మా చిత్రం యొక్క “ఫస్ట్ కీ” ని లాంచ్ చేసిన కాటికాపరి, లిమ్కాబుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ 2011 పురస్కార గ్రహీత, శ్రీ డా. పట్టపగలు వెంకట్రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే..దేవుడు, దెయ్యం, సైన్స్ లో ఏది వాస్తవం అనేది మాచిత్రం యొక్క కంటెంట్. ఈ కంటెంట్ నే నేను ఎందుకు తీసుకున్నా నంటే..ఈ సమాజంలో దేవుడు, దెయ్యం వున్నాయని కొందరూ,ఈ రెండు ఏవీ లేవు సైన్స్ మాత్రమే వాస్తవం అని మరికొందరు చెబుతూ వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ వాదనలు చేసే వాళ్ళు సామాన్యులు మాత్రమే కాదు,ఎంతో ఉన్నత పదవుల్లో వున్న మేధావులు కూడా చేస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూస్తుంటే..మనుషుల్లో శాస్త్రీయ స్ఫూర్తి లోపించి,విజ్ఞానం వినాశనానికి దారి తీస్తుందా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మన దేశంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అర్థమవుతుంది. ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో ఉదాహరణకు తీసుకుంటే…మొన్న తెలంగాణ లో మోతె మండలానికి చెందిన BED చదివిన ఒకతల్లి దోషం పోతుందని దేవుడి చిత్రపటాల ముందు 6 నెలల పసిబిడ్డని గొంతు కోసి చంపేసింది. అలాగే గుజరాత్ లో ఒక వ్యక్తి పొలంలోకి వెళ్తే దెయ్యాల గుంపు వేధిస్తున్నాయని చెప్పి,అందులో రెండు దెయ్యాలు మాత్రం చంపేస్తాయని బెదిరించాయని.. ఏకంగా పోలీసుస్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ కూడా ఇచ్చాడు. మన పక్క రాష్ట్రం తమిళనాడు లో ఒక తండ్రి తన కొడుకు తమతో వుంటే అదృష్టం కలిసి రావట్లేదని ఒక జ్యోతిష్యుడు చెప్పాడని తన కన్న కొడుకునే సజీవదహనం చేసాడు. మొన్నీ మధ్య తూర్పు గోదావరి జిల్లాలో ఏసుప్రభువు రమ్మంటున్నాడని అక్కాచెల్లెళ్ళు ఉరి వేసుకుని చనిపోయారు.అలాగే తెలంగాణలో తరిగొప్పలనే గ్రామంలో దెయ్యం ఉందని ఊరు ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. గూడూరులో ఒకామె పూనకం వచ్చి గుడి కట్టిస్తే..కరోనాని ఖతం చేస్తానని చెబుతుంది.

ఇలా ఎన్నో సంఘటనలుఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో మూఢ విశ్వాసాలను ప్రోత్సహించేలా బి హెచ్ యు అంటే బనారస్ హిందూ యూనివర్సిటీలో “భూతవైద్యం” పై ఆరు నెలల సర్టిఫికెట్ కోర్సు ప్రారంభించింది. దీనిపై కూడా మీడియాలో,సోషల్ మీడియాలో దుమారం రేగుతుంది.ఇంత టెక్నాలజీ వచ్చినా ఇంకా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే మనం ఎటు పోతున్నామా అనిపిస్తుంది.ఇలా మన దేశంలో ఎన్నో మరెన్నో సంఘటనలు జరుగుతున్నాయి. అలాంటి సంఘటనల్లో ఈ మధ్య సంచలనం సృష్టించింది చిత్తూరు జిల్లాలోని మదనపల్లి సంఘటన. తల్లిదండ్రులు బాగా చదువుకొని, ఉన్నత పదవుల్లో ఉన్న వాళ్లు కన్న బిడ్డలను పూజగదిలో చంపేశారు. ఆ ఇన్సిడెంట్ లోకి వెళ్లి చూస్తే.. అందులో మూడు కోణాలు కనిపిస్తున్నాయి. ఒక కోణం ఏంటంటే నా బిడ్డలు శివపార్వతులు వాళ్ళు బతికి వస్తారని చెప్పినందుకు…అతి ఆధ్యాత్మిక చింతన మనిషి ప్రాణాలను బలి తీసుకుంటుందా.. అనిపిస్తుంది.మరో కోణంలో చూస్తే ఇంకో కూతురు వాకింగ్ కి వెళ్ళినప్పుడు ఒక నిమ్మకాయ తొక్కి వచ్చిన తర్వాత ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చిందని ఒక మంత్రగాడ్ని ఆశ్రయించి, తాయత్తులు కట్టించిన తర్వాత పూజగదిలో చంపేసి నందుకు వారిని దయ్యం చంపిందను కోవాలా…?కూతుళ్లను చంపిన తర్వాత పోలీసులు అరెస్టు చేసి ఇంటరాగేషన్ చేసినప్పుడు సైకియాట్రిస్ట్ అండ్ సైకాలజిస్టుల ప్రకారం వారి మానసిక పరిస్థితి సరిగా లేదని చెప్పినందుకు సైన్సు వాస్తవం అనుకోవాలా..? ఏది వాస్తవం అనుకోవాలి ? ఇలా ఒక ఇన్సిడెంట్ లొనే మూడింటితో ముడిపడి ఉన్నట్టు, ప్రతి మనిషికి కూడా దేవుడు దయ్యము సైన్స్ తో ముడిపడి ఉన్నాయి.అందుకే ఈ ముడిని ఎవ్వరూ విప్పట్లేదు. అందుకే చాలా చర్చల్లో దేవుడు దయ్యం ఉన్నాయని కొందరూ, సైన్స్ ఉందని మరికొందరు ఇలా చర్చల మీద చర్చలు జరుపుతారు కానీ ..ఇదే వాస్తవం అని ఎవ్వరూ చెప్పట్లేదు.

ఒక డిబేట్ లో కూర్చున్నప్పుడు రసవత్తరమైన చర్చలు జరుపుతారు కానీ..దేవుడే ఉన్నాడని బల్ల గుద్ది వీళ్ళు చెప్పరు,సైన్స్ మాత్రమే వాస్తవం అని వాళ్ళు చెప్పరు.కానీ చివరికి వచ్చే సమయానికి ఎవరి నమ్మకం వాళ్ళది. ఇది ప్రజాస్వామ్యం మా నమ్మకం మాది మీ నమ్మకం మీది అని అని చెప్పి వదిలేస్తున్నారు కానీ అసలు వాస్తవం ఎవ్వరూ చెప్పట్లేదు. కానీ నేను అలా కాదు..అసలు వాస్తవం ఏంటో నేను చెప్పాలనుకున్నాను. ఏదో సినిమాలో సైన్స్ ప్రకారం దెయ్యం లేదు, మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రమే సినిమాను తీశానని చెప్పి చేతులు దులుపేసుకునే వాడ్ని కాదు.అసలు నిజంగా దేవుడు వున్నాడా..దెయ్యం వుందా.. సైన్స్ వుందా..? వుంటే.. ఏ రూపంలో వున్నాయి..? అసలు వాస్తవం ఏంటి అని నేను చెప్పాలను కున్నాను. అలా చెప్పా లనుకున్నాను కాబట్టే దమ్మున్న కథతో మీ ముందుకు రాబోతున్నాను. కాబట్టి..ఈ చిత్రం దైవ భక్తులని దయ్యాలకు భయపడే వాళ్లకి సైన్స్ ని నమ్మేవాళ్ళని అందరికీ మెచ్చేలా ఉంటూ విమర్శకుల ప్రశంసలు కూడా పొందబోతుంది.క థే..కథానాయకుడు అయినటువంటి మా చిత్రం లవ్, సెంటిమెంట్ ,కామెడీ ,హర్రర్ ,సస్పెన్స్,థ్రిల్లర్ తో పాటు మంచి సందేశాన్ని కూడా ఇవ్వబోతున్నాం. మా చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది కాబట్టి అతి త్వరలో రిలీజ్ చేయబోతున్నాం. మరొక్కసారి మా “జి ఎస్ టి”మూవీ “ఫస్ట్ కీ”లాంచ్ చేసిన కాటికాపరి, లిమ్కా బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ 2011 పురస్కార గ్రహీత శ్రీ డా. పట్టపగలు వెంకట్రావు గారికి మరియు ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని దర్శకుడు అన్నారు.


ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus