Gunasekhar, Chiranjeevi: ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతుందా..!

  • September 21, 2021 / 02:57 PM IST

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారారు. యంగ్ హీరోల దగ్గర కూడా లేనన్ని ప్రాజెక్ట్ లు చిరు దగ్గర ఉన్నాయి. ఒకదాని తరువాత ఒకటి అంటూ సినిమాలను పూర్తి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమా తరువాత బాబీ, మెహర్ రమేష్, మోహన్ రాజా లాంటి దర్శకులతో సినిమాలు చేయనున్నారు చిరంజీవి. ఇప్పుడు ఆయన లిస్ట్ లో మరో డైరెక్టర్ చేరే అవకాశం ఉందని సమాచారం.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా వెలుగొందిన గుణశేఖర్ ఈ మధ్య కాస్త జోరు తగ్గించారు. ఇటీవలే ‘శాకుంతలం’ సినిమాను పూర్తి చేసిన ఆయన మెగాస్టార్ చిరంజీవికి కథ చెప్పాలని చూస్తున్నారట. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘చూడాలని ఉంది’, ‘మృగరాజు’ వంటి సినిమాలు వచ్చాయి. ‘చూడాలని ఉంది’ సినిమా మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ.. ‘మృగరాజు’ సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని టాక్.

అయితే మరో రెండేళ్ల వరకు చిరు చాలా బిజీ ఉంటారు. ఆయన ఒప్పుకున్న సినిమాలే కాకుండా.. మారుతి, వెంకీ అట్లూరి లాంటి దర్శకులతో కూడా చిరు సినిమాలు చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే గుణశేఖర్ కి ఇప్పట్లో కాల్షీట్స్ ఇచ్చే అవకాశమే లేదు. ప్రస్తుతానికైతే ఈ ప్రాజెక్ట్ ఇంకా డిస్కషన్ స్టేజ్ లోనే ఉంది. మరేం జరుగుతుందో చూడాలి!

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus