Guntur Kaaram: గుంటూరు కారం సినిమాకు ఆ ట్విస్ట్ హైలెట్ కానుందా?

మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాకు ఎన్నో ఆవాంతరాలు ఎదురైనా 2024 సంక్రాంతి కానుకగా ఈ సినిమాను కచ్చితంగా విడుదల చేసేలా త్రివిక్రమ్ ప్రణాళికను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా షాకింగ్ అప్ డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా ఇంటర్వెల్ సమయంలో మహేష్ బాబు పాత్రకు సంబంధించి షాకింగ్ ట్విస్ట్ రివీల్ అవుతుందని ఆ ట్విస్ట్ పోకిరి మూవీ ట్విస్ట్ ను మించి ఉండనుందని తెలుస్తోంది.

పోకిరి సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్ కాగా గుంటూరు కారం సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ భారీ రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. గుంటూరు కారం మూవీ బడ్జెట్ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం. గుంటూరు కారం సినిమాలో యాక్షన్ సీన్లు సైతం కొత్తగా ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఈ సినిమా (Guntur Kaaram) స్క్రిప్ట్ కు సంబంధించి పొరపాట్లు జరగకుండా త్రివిక్రమ్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 80 కోట్ల రూపాయల మొత్తానికి తీసుకుందని సమాచారం అందుతోంది. డిజిటల్ హక్కులతోనే ఈ సినిమా దాదాపుగా 25 శాతం బడ్జెట్ ను రికవరీ చేసింది. గుంటూరు కారం సినిమాతో మహేష్ మరో హిట్ ను సొంతం చేసుకుంటారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు గత సినిమాలు సైతం అంచనాలను మించి సక్సెస్ సాధించి నిర్మాతలకు మంచి లాభాలను అందించాయి. గుంటూరు కారం సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus