2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా అంచనాలు అందుకోలేదు. మహేష్ బాబు (Mahesh Babu) – త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమా కావడం, అలాగే రాజమౌళి (S. S. Rajamouli) దర్శకత్వంలో కంటే ముందు త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన సినిమా కావడంతో.. ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది అని అభిమానులు ఆశించారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. సినిమాకి మొదటి రోజు నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ వల్ల కూడా నెగిటివిటీ మరింతగా స్ప్రెడ్ అయ్యింది.
అయితే మహేష్ బాబు, త్రివిక్రమ్ ఫామ్లో ఉండటం.. ప్రేక్షకులకి ఈ సినిమా సెకండ్ ఆప్షన్ గా ఉండటంతో 85 శాతం పైనే రికవరీ సాధించి యావరేజ్- అబౌవ్ యావరేజ్ గ్రాసర్ గా నిలిచింది. ‘గుంటూరు కారం’ ఆడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి.అవేంటో నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. ఫ్యామిలీ సినిమాకి ‘గుంటూరు కారం’ అనే మాస్ టైటిల్ పెట్టడం, మిడ్ నైట్ షోలు వేయడం వంటివి.. ఈ సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చేలా చేశాయి అనేది నాగ వంశీ ఉద్దేశం.
అంతేకాదు మొన్నామధ్య నాగ వంశీ మాట్లాడుతూ ‘ ‘గుంటూరు కారం’.. మీరు చూసిన సినిమా వేరు.. నేను చూసిన సినిమా వేరు’ అంటూ అసలు ఈ సినిమా ప్లాప్ అంటే ఒప్పుకునేది లేదు అంటూ నాగవంశీ కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాస్తవానికి ‘గుంటూరు కారం’ సినిమాని 2023 ఆగస్టులో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ మధ్యలో షూట్ చేసిన చాలా పోర్షన్ ని పక్కన పడేశారు.
పూజా హెగ్డే (Pooja Hegde) ట్రాక్ అంతా పోయింది. కథ మారిపోయింది. హీరోయిన్లు మారిపోయారు. ఓ మలయాళం సినిమాని త్రివిక్రమ్ ఫ్రీమేక్ చేసి పడేయడంతో మహేష్ బాబు మొత్తం మార్పులు చేయాలని డిమాండ్ చేశారనే టాక్ ఉంది. ఇవన్నీ పక్కన పెడితే.. ఇటీవల ‘పుష్ప 2’ ’ (Pushpa 2) సినిమాని రీలోడెడ్ వెర్షన్ అంటూ రిలీజ్ చేశారు. ఇదే పద్ధతిలో ‘గుంటూరు కారం’ ని కూడా రీ- లోడెడ్ వెర్షన్లా రిలీజ్ చేయాలనే ఆలోచన నిర్మాతలకి ఉందట.
ప్రస్తుతానికి దీనిపై చర్చలు జరుగుతున్నట్లు వినికిడి. అయితే ఓటీటీ పరంగా మంచి డీల్ వస్తే ‘గుంటూరు కారం’ రీలోడెడ్ వెర్షన్ ని రిలీజ్ చేసి.. దానికి వచ్చిన రెస్పాన్స్ ను బట్టి.. తర్వాత థియేటర్లలో రీ- రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా నిర్మాతలు కలిగి ఉన్నట్లు టాక్. మరి ఇందులో ఎంతవరకు నిజముందో అధికారిక ప్రకటన వస్తే తప్ప చెప్పలేం.