ఆర్ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో బిగ్ సక్సెస్ చూసిన అజయ్ భూపతి (Ajay Bhupathi), తర్వాత మహా సముద్రం (Maha Samudram) అనే ప్రయోగం చేసి డిజాస్టర్ ఎదుర్కొన్నాడు. ఇక మళ్ళీ స్టైల్ మార్చు మరో డిఫరెంట్ థ్రిల్లర్ మంగళవారంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2023లో విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్ లవర్స్‌కి మంచి అనుభూతిని అందించింది. బాక్సాఫీస్ వద్ద సాధారణ రన్ కొనసాగించినప్పటికీ, ఓటీటీలో మాత్రం మంగళవారంకు (Mangalavaaram) విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. అనేక ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ప్రదర్శించబడిన ఈ సినిమా అవార్డులను కూడా దక్కించుకుంది.
అయితే ఈ క్రేజ్ కొనసాగించేందుకు అజయ్ భూపతి ఇప్పుడు మంగళవారం 2 (Mangalavaram 2) సీక్వెల్‌ను సిద్ధం చేస్తున్నారు. కథ స్క్రిప్ట్ వర్క్ దశలో ఉండగానే, ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. మంగళవారంలో హీరోయిన్‌గా నటించిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), సీక్వెల్లో మాత్రం కనిపించబోవడం లేదట. కథా పరంగా ఆమె పాత్ర ముగిసిపోయిందని, అందుకే కొత్త కథలో ఆమె పాత్రకు ప్రాధాన్యత లేదని అంటున్నారు.
అసలు మంగళవారంలో పాయల్ చేసిన పాత్ర అప్పట్లో సెన్సేషన్ అనే చెప్పాలి, దానికి అగ్రహీరోయిన్లు సైతం ఒప్పుకోలేదు. అతి Sruగారానికి బానిసగా ఉండే ఓ మానసిక వైద్య సమస్యతో కొట్టుమిట్టాడే పాత్రను అంత నేచురల్‌గా చేయడం సులభమైన పని కాదు. అయితే పాయల్ ఆ ఛాలెంజ్‌ను అంగీకరించి, తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్‌లో ఆమె ఇంత బలమైన పాత్రలో కనిపించడం టాలీవుడ్‌లో అరుదైన విషయమే.
అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన క్యారెక్టర్ తర్వాత, ఆమె సీక్వెల్‌లో భాగం కాకపోవడం షాకింగ్ న్యూస్‌గా మారింది. అభిమానుల్లో కొంత నిరాశ కలిగించినా, దర్శకుడు అజయ్ భూపతి మాత్రం కొత్త కథ, కొత్త స్టార్స్ తో మంగళవారం-2ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరింత మిస్టరీ, థ్రిల్ ఉండేలా స్క్రిప్ట్‌ను డెవలప్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపుగా పూర్తయిందని, త్వరలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని సమాచారం. కొత్త కథలో కొత్త హీరోయిన్‌కి స్థానం కల్పించేలా, మంగళవారం 2 కథలో కీలక మార్పులు చేశారని తెలుస్తోంది.