GV Prakash, Saindhavi: ఏడాదిన్నర తర్వాత జీవీ ప్రకాష్ దంపతులకు విడాకులు మంజూరు..!

జీవీ ప్రకాష్ తన భార్య సైంధవితో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించింది ఏడాది దాటింది. 2024 మే నెలలో వీరు విడాకుల విషయమై అధికారిక ప్రకటన చేశారు. తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సైంధవిని ప్రేమించి పెళ్లి చేసుకున్న జీవీ ప్రకాష్.. దాదాపు 10 ఏళ్ళ పాటు బాగానే కాపురం చేశారు. కానీ తర్వాత వీరి మధ్య మనస్పర్థలు వచ్చ్చాయి. ఈ దంపతులకి ఓ పాప కూడా ఉంది. అయినా సరే విడిపోవడానికి రెడీ అయ్యారు. 2013 పెళ్లి చేసుకున్న ఈ జంట 2024 లో విడాకులకు అప్లై చేసింది.

GV Prakash, Saindhavi

అయితే వీరికి పాప ఉంది కాబట్టి.. ఆ విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుని కోర్టు కౌన్సిలింగ్ సెషన్స్ నిర్వహించింది. అయినప్పటికీ వీళ్ళు మనసు మార్చుకోలేదు అని స్పష్టమవుతుంది. పాప విషయంలో వీరికి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించి.. కొన్ని కండిషన్స్ మీద విడాకులు మంజూరు చేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 30న వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. పాప అన్వి తల్లి సైంధవి వద్ద ఉండటానికి జీవి ప్రకాష్ కు ఎటువంటి అభ్యంతరం లేదు అని తెలిపినట్టు సమాచారం.

అలాగే అన్వి విషయంలో ఇద్దరూ బాధ్యతగా వ్యవహరిస్తామని కూడా కోర్టులో అంగీకరించారట. అలాగే జీవి ప్రకాష్ తాను పనిచేసే సినిమాల విషయంలో కూడా సైంధవికి అవకాశాలు ఇస్తానని మాట ఇచ్చాడట. వ్యక్తిగతంగా తప్ప స్నేహితులుగా వీళ్ళు కలిసే ఉంటారని స్పష్టమవుతుంది.ఈ రకంగా ప్రస్తుతం కోలీవుడ్లో జీవి ప్రకాష్,సైంధవి..ల విడాకుల వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ అయ్యింది.

ఫస్ట్‌ ఏఐ హీరోయిన్‌ వచ్చేస్తోంది.. పేరు, వివరాలు తెలుసా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus