అల్లు అర్జున్ హీరోగా దేశముదురు సినిమాకి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి హన్సిక.ఇలా మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మకు తెలుగులో విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం కావడంతో హన్సికకు తెలుగులో పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చాయి. అయితే ఈ సినిమా అనంతరం ఈమె నటించిన సినిమాలు పెద్దగా ప్రేక్షకులను సందడి చేయలేకపోయాయి. ఇలా తెలుగులో ఈమెకు ఆదరణ లేకపోవడంతో తమిళ ఇండస్ట్రీ వైపు ఆసక్తి చూపించారు.
ఇకపోతే తమిళంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్న హన్సిక అగ్ర హీరోల సరసన నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందారు. హన్సిక అగ్ర తారగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఈమెకు పలువురు హీరోలతో ఎఫైర్స్ ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేశాయి. ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. హన్సిక త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని,
ఈమె త్వరలోనే పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతుందనే వార్తలు వినపడుతున్నాయి. ఇలా హన్సిక పెళ్లి వార్త వైరల్ కావడంతో ఈమె ఎవరిని పెళ్లి చేసుకుంటుందనే కుతూహలం ఎక్కువైంది. హన్సిక ఇండస్ట్రీకి చెందిన వారిని కాకుండా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారిని పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినపడతున్నాయి.
ఈమె పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబానికి పెద్ద ఇంటి కోడలుగా వెళుతుందనీ సమాచారం. ఇప్పటికే ఈమె పెళ్లికి సంబంధించిన విషయాలన్నింటిని వీరి కుటుంబ సభ్యులు నిశ్చయించుకున్నారని, త్వరలోనే వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడుతుందని సమాచారం.
Most Recommended Video
అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?