Hansika: విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నటి హన్సిక!

  • November 15, 2023 / 07:57 PM IST

దేశముదురు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైనటువంటి నటి హన్సిక ప్రస్తుతం వరుస సినిమాలో సిరీస్ లలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఈమె గత ఏడాది వివాహం చేసుకున్నప్పటికీ సినిమా ఇండస్ట్రీకి మాత్రం దూరం కాలేదు. ఇలా పెళ్లి చేసుకున్న తర్వాత కూడా హన్సిక వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. తాజాగా ఈమె ప్రధాన పాత్రలో నటించిన మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా విడుదల కానుంది.

ఈ సినిమాలో హన్సిక ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా నవంబర్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిత్ర బృందంతో పాటు హన్సిక నేడు విజయవాడ చేరుకొని దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇలా హన్సిక ఆలయానికి రావడంతో పండితులు ఆమెకు సాదర ఆహ్వానం పలికారు.

ఇలా అమ్మవారిని దర్శనం చేసుకున్న అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఇలా అమ్మవారి దర్శనం అనంతరం హన్సిక మీడియా సమావేశంలో పాల్గొని పలు విషయాలను తెలియజేశారు. ఈరోజు విజయవాడలో అమ్మవారిని దర్శించుకోవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని తెలిపారు. ముఖ్యంగా గాజుల అలంకరణలో అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.

ఇక తాను నటించిన మై నేమ్ ఇస్ శృతి అనే సినిమా ప్రమోషన్లలో భాగంగానే తాను విజయవాడకు వచ్చానని హన్సిక తెలియజేశారు. ఈ సినిమా నవంబర్ 17వ తేదీ విడుదల అవుతుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించాలని అమ్మవారిని నమస్కరించినట్టుగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక పెళ్లి తర్వాత హన్సిక (Hansika) ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే ఆసక్తి చూపుతున్న సంగతి మనకు తెలిసిందే.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus