ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడగా ఈ సినిమాకు థియేటర్ల విషయంలో అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ లో ఈ సినిమాకు తక్కువ సంఖ్యలో సింగిల్ స్క్రీన్స్ కేటాయించడం విషయంలో నిర్మాత ఘాటుగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. సంక్రాంతి పోటీని తట్టుకోవడానికి హనుమాన్ మూవీ అదుర్స్ అనిపించే ప్లాన్ వేసింది.
ఈ నెల 11వ తేదీనే హనుమాన్ షోలు భారీగా ప్రదర్శితం అయ్యేలా ప్లాన్ చేశారని సమాచారం అందుతోంది. హనుమాన్ మూవీ ప్లాన్ వర్కౌట్ అయితే మాత్రం భారీ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. మరోవైపు హనుమాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి హాజరవుతున్నారు. చిరంజీవి హాజరు కావడం వల్ల సినిమాపై అంచనాలు పెరిగే ఛాన్స్ అయితే ఉంది.
చిరంజీవితో తేజ సజ్జాకు ఉన్న అనుబంధం వల్లే ఆయన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సంక్రాంతి పండుగకు రిలీజ్ కానున్న సినిమాలలో గుంటూరు కారం తర్వాత అదే స్థాయిలో ఆసక్తి హనుమాన్ మూవీపై ఉంది. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకున్న నేపథ్యంలో హనుమాన్ మూవీకి స్క్రీన్స్ కొంతమేర అయినా పెరగాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
నైజాంలో హనుమాన్ (Hanu Man) మినహా మిగతా 3 సినిమాలను దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారని తెలుస్తోంది. గతేడాది సంక్రాంతికి మూడు సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. మూడు సినిమాలకు పాజిటివ్ టాక్ రావడంతో భారీ స్థాయిలో కలెక్షన్లు నమోదయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి సినిమాలు అదే స్థాయిలో సక్సెస్ సాధిస్తాయో లేదో చూడాలి.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!