సంక్రాంతి పండుగ కానుకగా రిలీజ్ కానున్న హనుమాన్ సినిమాకు థియేటర్ల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని వార్తలు వినిపిస్తున్నా రిలీజ్ సమయానికి పరిస్థితులు మారే ఛాన్స్ అయితే ఉంది. ఓవర్సీస్ లో హనుమాన్ మూవీ 500 థియేటర్లలో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఓవర్సీస్ లో ఈ స్థాయి థియేటర్లు అంటే రికార్డ్ అనే చెప్పాలి. హనుమాన్ సినిమా నార్త్ లో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజవుతోంది.
హనుమాన్ సినిమాకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో సైతం స్క్రీన్ కౌంట్ పెరిగే అవకాశం ఉంది. హనుమాన్ మూవీ అటు తేజ సజ్జా కెరీర్ లో ఇటు ప్రశాంత్ వర్మ కెరీర్ లో ఇటు తేజ సజ్జా కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. హనుమాన్ మూవీ ఏ రేంజ్ లో బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. హనుమాన్ మూవీకి బిజినెస్ మాత్రం భారీ స్థాయిలోనే జరిగింది.
ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరు కానుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. హనుమాన్ మూవీ కమర్షియల్ గా ఏ రేంజ్ లో హిట్ గా నిలుస్తుందో చూడాల్సి ఉంది. హనుమాన్ మూవీలో చిరంజీవి కనిపిస్తారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారం గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
అమృతా అయ్యర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా ఆమె కూడా ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నారు. హనుమాన్ సక్సెస్ సాధిస్తే హనుమాన్ తరహా కాన్సెప్ట్ లతో మరికొన్ని సినిమాలు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇతర భాషల్లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!