Hanu Man: అరుదైన రికార్డ్ ను సొంతం చేసుకున్న హనుమాన్.. అసలేమైందంటే?

  • January 12, 2024 / 10:30 AM IST

తేజ సజ్జా ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. బెంగళూరులో ఎక్కువ సంఖ్యలో పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శితం అయిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించి 89 పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శిం కావడం గమనార్హం. ఈ విధంగా అరుదైన రికార్డ్ ను హనుమాన్ ఖాతాలో వేసుకుంది. ఈ ఘనత దక్కిన తొలి తెలుగు మూవీ హనుమాన్ కావడం గమనార్హం.

హనుమాన్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే సినిమా కాగా ఈ సినిమా కలెక్షన్లు సైతం భారీ రేంజ్ లో ఉండే ఛాన్స్ ఉంది. ఈ సినిమా బుకింగ్స్ సైతం వేరే లెవెల్లో ఉన్నాయి. హనుమాన్ మూవీ సులువుగానే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సినిమా సినిమాకు తేజ సజ్జా తన రేంజ్ ను పెంచుకుంటున్నారు. హనుమాన్ మూవీ ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది.

నార్త్ లో ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు. హనుమాన్ మూవీ సక్సెస్ తో ప్రశాంత్ వర్మను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబోలో ఒక సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాల్సి ఉంది. హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ సైతం పెరిగే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

హనుమాన్ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు అదుర్స్ అనేలా ఉంటే బాలయ్య ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిస్తే నా ప్రణాళికలన్నీ సజావుగా సాగుతాయని ప్రశాంత్ వర్మ కామెంట్లు చేశారు. బాలయ్యకు కథ నచ్చిందని హనుమాన్ రిలీజ్ తర్వాత తదుపరి కార్యాచరణ ఉంటుందని ప్రశాంత్ వర్మ అన్నారు.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus