టాలీవుడ్ లో ‘సీతారామం’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకోవటమే కాకుండా, సినీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న దర్శకుడు హను రాఘవపూడి. ఈ డైరెక్టర్ తనదైన టాలెంట్ తో ఆ సినిమా తెరకెక్కించిన విధానం చాలా ప్రత్యేకమైనది. ఆ సినిమా ప్రభావం ఎంతలా ఉందంటే.. ‘సీతారామం’ లో హీరోయిన్ క్యారెక్టర్ లో నటించిన ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్, ఆ సినిమా రిలీజ్ తరువాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ దర్శకుడు హను రాఘవపూడి గురించిన ఒక విషయం నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే…
ప్రస్తుతం ఈ దర్శకుడు హను, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ‘ఫౌజీ’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వీ కధానాయకురాలిగా నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఎలాగైనా ఈ ఏడాది దసరా కానుకగా థియేటర్లలో విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట మేకర్స్. అందుకు సంబంధించి డైరెక్టర్ హను పనితీరు మీద నమ్మకంతో ఫ్రీ హాండ్ ఇచ్చేశారట నిర్మాతలు. దీంతో గ్యాప్ లేకుండా సినిమా షూటింగ్స్ ను ఆగష్టు చివరిలోపు కంప్లీట్ చేయాలని దర్శకుడు టార్గెట్ పెట్టుకున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉండగా, సినీ వర్గాల్లో మాత్రం ఇదంతా అయ్యే పని కాదని చర్చించుకుంటున్నారట.
అయితే, ఈ దసరా ను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవటానికి కారణం కూడా లేకపోలేదు, అదేంటంటే పండుగ సీజన్లో కావటంతో సినీ ప్రేక్షకులు థియేటర్లలో సినిమా చూడటానికి ఇష్టపడుతారు. అందుకే అంత మంచి టైం ని మిస్ చేయకుండా , చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ సర్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా, ‘సీతారామం’ చిత్రానికి స్వరాలు అందించిన విశాల్ చంద్రశేఖర్ యే దీనికి కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు.