తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్లో రూపొందిన ‘హను-మాన్’ మూవీ ఈరోజు అంటే జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న అంటే జనవరి 11 న ఈ సినిమా ప్రీమియర్ షోలు చాలా చోట్ల పడ్డాయి. అన్నిటికి కూడా యునానిమస్ గా పాజిటివ్ రెస్పాన్స్ లభించింది. దీంతో కలెక్షన్స్ అద్భుతంగా వస్తాయి అనే భరోసా అందరిలో ఏర్పడింది. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘హను-మాన్’ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ ఎంత వరకు జరిగింది అనే ప్రశ్న..
ఇప్పుడు అందరిలోనూ ఏర్పడింది. వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 7.20 cr |
సీడెడ్ | 4.50 cr |
ఆంధ్ర(టోటల్) | 10.00 cr |
ఏపీ + తెలంగాణ | 21.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ హిందీ | 2.50 cr |
ఓవర్సీస్ | 4.00 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 28.20 cr |
‘హనుమాన్’ (HanuMan) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.28.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఆ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.28.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ కనుక వస్తే.. ‘హనుమాన్’ సినిమా ఈజీగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం పుష్కలంగా ఉంది. అంతేకాదు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకుని ఎక్కువ లాభాలు బయ్యర్స్ కి మిగిల్చే అవకాశాలు కూడా ఉన్నాయి.అలాగే లాంగ్ రన్ కి కూడా స్కోప్ ఉంది.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!