పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు’. ‘మెగా సూర్య ప్రొడక్షన్స్’ బ్యానర్ పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించగా ఏ.ఎం.రత్నం సమర్పకులుగా వ్యవహరించారు. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ వంటివి ఆకట్టుకోవడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.
జూలై 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న మొదటి పాన్ ఇండియా మరియు పీరియాడిక్ మూవీ కాబట్టి.. అతని బ్రాండ్ పై మంచి థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
నైజాం | 36.5 cr |
సీడెడ్ | 16.5 cr |
ఉత్తరాంధ్ర | 11.3 cr |
ఈస్ట్ | 8.5 cr |
వెస్ట్ | 6.5cr |
గుంటూరు | 9 cr |
కృష్ణా | 7.5 cr |
నెల్లూరు | 4.2 cr |
ఏపీ+తెలంగాణ టోటల్ | 100 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 11 cr |
ఓవర్సీస్ | 9 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 120 (షేర్) |
‘హరిహర వీరమల్లు’ చిత్రానికి రూ.120 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.121 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తే.. ఇప్పుడు సినిమాలు లేని టైం కాబట్టి.. బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి.