సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా జ్ఞాన సాగర్ ద్వారక (Gnanasagar Dwaraka) దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హరోం హర’ (Harom Hara) . పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదలైన ఈ సినిమా.. ఇప్పుడు అంటే జూన్ 14న రీజనల్ మూవీగానే రిలీజ్ అయ్యింది. టీజర్, ట్రైలర్.. బాగున్నాయి. సినిమా చూడాలనే ఆసక్తిని కలిగించాయి. సునీల్ (Sunil) కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో మాళవిక శర్మ (Malvika Sharma) హీరోయిన్. ప్రమోషనల్ కంటెంట్ ప్రామిసింగ్ గా ఉండటంతో సినిమాపై కొంత బజ్ ఏర్పడింది. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది.
దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే నమోదయ్యాయి. కానీ 2వ రోజు నుండి డౌన్ అయ్యాయి. ఆ తర్వాత కోలుకుంది లేదు. ఫైనల్ గా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది ఈ సినిమా. ఒకసారి (Harom Hara Collections) క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 1.13 cr |
సీడెడ్ | 0.27 cr |
ఉత్తరాంధ్ర | 0.30 cr |
ఈస్ట్ | 0.12 cr |
వెస్ట్ | 0.07 cr |
కృష్ణా | 0.24 cr |
గుంటూరు | 0.15 cr |
నెల్లూరు | 0.08 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 2.36 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.15 cr |
ఓవర్సీస్ | 0.17 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 2.68 cr (షేర్) |
‘హరోం హర’ చిత్రానికి రూ.5.99 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.6.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.2.68 కోట్ల షేర్ ను రాబట్టింది. ఫైనల్ గా రూ.3.62 కోట్లు నష్టాలను మిగిల్చి కమర్షియల్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది.